Prabhas: ప్రభాస్ అభిమాని ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

Prabhas: సాధారణంగా అభిమానులు వారు ఎంతగానో అభిమాన హీరోలపై వారికి ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాటుకుంటూ ఉంటారు. కొంతమంది వారి అభిమాన హీరో విడుదల సమయంలో భారీగా కటౌట్లను ఏర్పాటు చేయడం, ఆ కటౌట్ లకు పాలాభిషేకాలు పెద్దపెద్ద పూలదండలు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు సినిమా సమయంలో వారి అభిమాన హీరో పోస్టర్ పేరుతో భారీగా కేకులు తయారు చేసి వాటిని కట్ చేస్తూ ఉంటారు. మరి కొందరు అభిమానులు వారి అభిమాన హీరోల కోసం అన్నదాన కార్యక్రమం, రక్తదానం ఇలా ప్రజలకు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.

ఇంకొందరు అయితే వారి అభిమాన హీరోల పేర్లను, ఫోటోలను పాటల రూపంలో వేయించుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్క అభిమాని ఒక్కొక్క విధంగా వారి అభిమాన హీరోల పై ఉన్న ప్రేమానురాగాలను, అభిమానాన్ని చాటుకుంటారు. అయితే కొన్నిసార్లు వారు ఎంతగానో అభిమానించే హీరోల గురించి తప్పుగా మాట్లాడిన, లేదంటే తప్పుగా ప్రచారాలు చేసినా కొంతమంది చంపడానికి అయినా వెనుకాడరు. ఇంకొంతమంది అయితే అభిమాన హీరోల కోసం ఏకంగా త్యాగాలు చేసేవారు కూడా ఎంతోమంది ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. అభిమానం అన్నది హద్దు దాటితే ఎలా ఉంటుంది అన్న దానికి ఇది చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలేం జరిగిందంటే.. కర్నూలు జిల్లా తిలక్ నగర్ కు చెందిన 24 ఏళ్ల రవితేజ అనే యువకుడు, అఘాయిత్యానికి పాల్పడి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. టాలీవుడ్ హీరో ప్రభాస్ కు అతడు వీరాభిమాని. అయితే రాధేశ్యామ్ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.

Advertisement

ఈ సినిమా విడుదలై హిట్ టాక్ కాకుండా, బాగాలేదు, స్లో గా ఉంది ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వినిపించడంతో సదరు అభిమాని ఆ వార్తలను జీర్ణించుకోలేకపోయాడు. దీనితో ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తన తల్లికి చెప్పి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై హీరో ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి. అయితే ప్రభాస్ అభిమానులు అందరూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని చెప్పవచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel