వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Sitara: పెద్దయ్యాక మహేష్ బాబు కూతురు ఏం కావాలనుకుంటుందో తెలుసా..ఈమె డ్రీమ్ మామూలుగా లేదు?

Sitara: సితార ఘట్టమనేని మహేష్ బాబు నమ్రత గారాలపట్టిగా అందరికీ సుపరిచితమే. ఈమె అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సితార ఇప్పటికే ఒక ఇంగ్లీష్ సినిమాకు డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన డాన్స్ వీడియోలు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ఈ విధంగా ఇంత చిన్న వయసులోనే సితార ఒకవైపు తన చదువులు కొనసాగిస్తూ ... Read more

By Ramesh Babu

Published on: May 11, 2022 6:35 AM

Updated on: May 11, 2022 6:35 AM

---Advertisement---

Sitara: సితార ఘట్టమనేని మహేష్ బాబు నమ్రత గారాలపట్టిగా అందరికీ సుపరిచితమే. ఈమె అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సితార ఇప్పటికే ఒక ఇంగ్లీష్ సినిమాకు డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన డాన్స్ వీడియోలు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ఈ విధంగా ఇంత చిన్న వయసులోనే సితార ఒకవైపు తన చదువులు కొనసాగిస్తూ మరో వైపు సోషల్ మీడియా వేదికగా తన టాలెంట్ బయటపెడుతూ అభిమానులను పోగు చేసుకున్నారు.

తాజాగా సితార మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమాలో పెన్నీ పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ విధంగా సితార డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించి ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయాలను, సినిమా పాటలకు డాన్స్ వీడియో లు చేస్తూ విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సితార తన డ్రీమ్ ఏంటో చెప్పుకొచ్చారు…

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా భవిష్యత్తులో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు… అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సితార సమాధానం చెబుతూ భవిష్యత్తులో తనకు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలనే కలలు ఏమాత్రం లేవని, తను కచ్చితంగా పెద్ద యాక్టర్ అవుతానని అదే తన డ్రీమ్ అంటూ సితార తన భవిష్యత్తు గురించి ఎంతో క్లారిటీతో ఉన్నారు. ఇక ఈమె ఫ్యూచర్ గురించి మహేష్ బాబు కూడా పలు సందర్భాలలో మాట్లాడుతూ సితార పెద్ద హీరోయిన్ అవుతుంది అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి రాబోయే రోజులలో మనం మహేష్ కూతురుని స్టార్ హీరోయిన్ గా చూడబోతున్నామని తెలుస్తోంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel