Niharika : నా పైనా ఎన్ని న్యూస్ రాసుకున్నా.. నాకు ఏమాత్రం ఫరక్ ఉండదు.. నిహారిక షాకింగ్ కామెంట్స్!

Niharika : మెగా బ్రదర్ నాగబాబు దళపతి నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ లో పుట్టిన ఈ అమ్మడు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఢీ షో లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన నిహారిక హీరోయిన్ గా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇటీవల నిహారిక పేరు వార్తల్లో నిలిచింది. ఇటీవల పోలీసులు పబ్ లో రైడ్ చేయటంతో నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతకాలం ఎక్కడ బయటకు కనిపించకుండా ఉన్న నిహారిక ఇటీవల మదర్స్ డే సందర్భంగా తన తల్లితో కలిసి ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.


Niharika : నిహారిక ఏంటో మాకు తెలుసు.. మా బావగారు ఉన్నారుగా.. మాకేం పర్వాలేదు : నిహారిక తల్లి 

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా నిహారిక తన తల్లితో కలిసి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. నిహారిక గురించి వచ్చిన వార్తలు విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అని అడిగిన ప్రశ్నకు నిహారిక తల్లి పద్మ సమాధానమిస్తూ.. మనం తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అంటారు కదా అని తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోలేం కదా. మేం ఏంటో మాకు తెలుసు. అలాగే మా కూతురి గురించి కూడ మాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది. ఎవరైనా బాగుపడుతున్నారంటే వారి మీద రాయి వేయాలని, కష్టపెట్టలని చాలా మంధి చూస్తుంటారు. మా బావ గారు ఉన్నంత వరకు మాకు ఎం పర్వలేదు అని నీహారిక తల్లి చెప్పుకొచ్చారు.

అలా ఎవరైనా అంటే.. కొట్టేస్తా.. 
ఈ విషయం గురించి నిహారిక మాట్లాడుతూ.. నేను అస్సలు న్యూస్ చూడను. యూట్యూబ్ థంబ్ మెయిల్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ అస్సలు చూడను . నా గురించి ఎన్ని న్యూస్ రాసుకున్నా నాకూ అసలు బాధ లేదు. నాపైనే ఎన్ని రాసినా జీరో.. నాకు ఏ మాత్రం ఫరక్ ఉండదు. ఎవడు వచ్చి నా ముఖం మీద చెప్పరు. ఒక వేళ ఎవరైనా అలా చెప్పినా కూడా మనం ఊరుకోం కదా కొట్టేస్తాం.. అంటూ నిహారిక సరదాగా కామెంట్స్ చేసింది. అలాంటివి ఏమీ పట్టించుకోవద్దని వరుణ్ ముందే చెప్పాడని నిహారిక తల్లి చెప్పుకొచ్చారు.

Advertisement

Read Also : Niharika Konidela : పబ్ వ్యవహారం తర్వాత నిహారికను హౌస్ అరెస్ట్ చేశారా… అందుకే బయటకు కనిపించడం లేదా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel