Ammayi Dragon Girl : అమ్మాయి డ్రాగన్ గర్ల్ సినిమా రివ్యూ..

Updated on: July 15, 2022

Ammayi Dragon Girl: బ్రూస్ లీ మరణించి ఇప్పటికి దాదాపుగా 5 దశాబ్దాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆయనని మర్చిపోలేక పోతున్నారు. చిన్న వయసులోనే మరణించిన బ్రూస్ లీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఆ కోట్లాదిమందిలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు అని చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ కి బ్రూస్ లీ అంటే ఎనలేని అభిమానం. రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అమ్మాయి డ్రాగన్ గర్ల్. ఈ సినిమా పూర్తిగా మార్చల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా నేడు అనగా జూలై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ram-gopal-varma-ammai-telugu-movie-review
ram-gopal-varma-ammai-telugu-movie-review

ఈ సినిమాలో కథ విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్నదల్లా కూడా మార్షల్ విన్యాసాలే అని చెప్పవచ్చు. ఈ సినిమాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి దొరకడంతో ఈ సినిమాను మరింత ఈజీగా తీయగలిగారు. అయితే రామ్ గోపాల్ వర్మ కు బ్రూస్ లీ అంటే అభిమానం ఉండడంతో బ్రూస్ లీ ని ఇమిటేట్ చేశారు. పూజా భలాకర్ మొదటినుంచి కూడా బ్రూస్ లీకి వీరాభిమాని. దాంతో ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం వైజాగ్ సిటీ వచ్చి అక్కడ సీనియర్ కోచ్ లుయ్ డ్రాగన్ స్కూల్లో నడుపుతూ ఉండగా ఆమె దగ్గర జాయిన్ అయి ట్రైనింగ్ తీసుకుంటుంది. అప్పుడే ఆమెకు అక్కడ లోకల్ డాన్ విఎం ఒకడు తన గురువుకు చెందిన కోట్ల విలువ చేసే మార్షల్ ఆర్ట్స్ నేర్పే ఆ డ్రాగన్ స్కూల్ ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఆస్తిని దక్కించుకోవడం కోసం ఆ కోచ్ ని చంపుతాడు. అలాంటి సమయంలో తన గురువుకు సంబంధించిన ఆస్తిని సంరక్షించుకోవడం కోసం ఆ విలన్ తో ఆమె ఏ విధంగా పోరాడుతుందో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

సాంకేతిక పరంగా చూసుకుంటే.. మ్యూజిక్ అంతగా బాగాలేదు. అలాగే స్లో మోషన్లు సెమీన్యూడ్ సీన్స్ చూపెడుతూ యాక్షన్ చూపించారు. ఈ సినిమాలో కెమెరా వర్క్ కూడా ఓకే అని చెప్పవచ్చు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సోసో గా ఉన్నాయి.

Advertisement

నటీనటుల పనితీరు విషయానికి వస్తే.. పూజా భలేకర్ నటన గురించి పక్కన పెడితే ఆమె చేసిన యాక్షన్ బ్లాక్స్ మాత్రం అదిరిపోయాయి. ఎటువంటి డూపు బిఎఫ్ ఎక్స్ లు వాడకుండా పూజ ఇలాంటి ఒక మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి ఏ విధంగా అయితే చేయగలదో అలాగే ఈ సినిమాలో చేశారు. అలాగే విలన్ అభిమన్యు సింగ్ కూడా ఓకే అని.

ప్లస్ పాయింట్స్ : బ్రూస్ లీ అనే పేరు ముడిపెట్టడం, అలాగే ఆకట్టుకునే యాక్షన్ సీన్స్.

Advertisement

మైనస్ పాయింట్స్ : ఎప్పటిలాగే రొటీన్ కథ.

నటీనటులు: పూజా భలేకర్, మియా ముఖి, అభిమన్యు సింగ్, రాజ్ పాల్ యాదవ్ తదితరులు
దర్శకత్వం :రామ్ గోపాల్ వర్మ
సంగీతం: పాల్ ప్రవీణ్ కుమార్
ఛాయా గ్రహణం: యుకే సెంథిల్ కుమార్
నిర్మాతలు : నరేష్ టి ,శ్రీధర్, రామ్ గోపాల్ వర్మ
విడుదల తేదీ :15-07-2022

రేటింగ్ : 1.5

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel