ఇంట్లో అక్వేరియం ఉంచడం చాలా శుభప్రదం. అందులో రంగురంగుల చేపలను ఎప్పుడూ ఉంచాలి. వాస్తు ప్రకారం.. చేపలను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఇత్తడి లేదంటే వెండి చేపల ప్రతిమన ఉంచాలి.
ఇంట్లో చిలుకను పెంచుకోవడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. చిలుకను సంతోషం, శాంతికి ప్రతీకగా చెబుతారు. చిలుక ఫొటో లేదా బొమ్మను పెట్టుకోవచ్చు. ఇంట్లో సానుకూల వాతావరణ ఏర్పడుతుంది.
ఇంట్లో తాబేలు విగ్రహం ఉంటే చాలా మంచిది. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. తాబేలుని విష్ణువు రూపంగా పరిగణిస్తారు. తాబేలు విగ్రహాన్ని ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.
ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచడం వల్ల కూడా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఇత్తడి లేదా తెల్లరాతి ఆవు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. సానుకూలత ఏర్పడుతుంది.
ఇంట్లో ఒంటె విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదమే. ఇంటి వాయువ్య దిశలో ఒంటె విగ్రహాన్ని ఉంచుకోవాలి. వ్యాపారంలో విజయం చేకూరుతుంది.
ఇంటి ఉత్తర గోడపై పరుగెత్తే గుర్రాల చిత్ర పటాన్ని ఉంచాలి. గుర్రాలు ఎప్పుడూ పరుగెడుతున్నట్లుగా కనిపించాలి. ఫొటోలు ఇంట్లో ఉంటే శుభకం కలుగుతుంది. గుర్రాలు పరుగెత్తినట్లుగానే, ఇంట్లో ఆర్థికంగా ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తారు.
లాఫింగ్ బుద్ధ ఇంటితో పాటు ఆఫీసులో కూడా పెట్టకోవచ్చు. సానుకూల వాతావరణంతో పాటు అదృష్టం కలిసి వస్తుంది.
ఆఫీసులో బంగారు నాణేలతో చేసిన ఓడను కూడా పెట్టుకోవచ్చు. వ్యాపారానికి ఆర్థిక బలాన్ని తీసుకురాగలదు. ఇతర ఆదాయ వనరులను కూడా కల్పిస్తుందని నమ్మకం..