Wedding Cards:మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరుగుతున్న సమయంలో పసుపు కుంకుమకు కీలక ప్రాధాన్యత ఇస్తాము. ఇలా శుభకార్యాలు మాత్రమే కాకుండా పూజా కార్యక్రమాలలో కూడా పసుపుకుంకుమలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక పోతే మన ఇంట్లో ఏదైనా వివాహం జరిగినా లేదా కేశఖండన జరిగిన మన బంధుమిత్రులను ఆహ్వానించడం కోసం ప్రత్యేకంగా పత్రికలు అచ్చు వేయించి బంధువులందరికీ పంపుతాము. ఈ విధంగా పెళ్లి పత్రికలు వేయించిన తరువాత వాటికి పసుపు కుంకుమ వేసి ముందు దేవుడి దగ్గర పెట్టి అనంతరం మన బంధువులకు ఆహ్వానం పలుకుతాము. అయితే పెళ్లి పత్రికలకు ఇలా పసుపు కుంకుమ ఎందుకు రాస్తారు..ఇలా పసుపు కుంకుమ రాయడం వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాలు చాలా మందికి తెలియవు. అయితే పసుపు కుంకుమను ఎందుకు పెడతారో ఇక్కడ తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జేష్టాదేవి అక్కచెల్లెళ్లు అనే సంగతి మనకు తెలిసిందే. లక్ష్మీదేవి అదృష్టానికి శుభానికి సంకేతం అయితే జేష్టాదేవి దరిద్రానికి సంకేతం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జేష్టాదేవి ఎవరు ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి చర్చలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి వెళ్లి సముద్రగర్భంలో దాక్కుంటుంది. సముద్రగర్భం నుంచి తను బయటికి రావాలని జేష్టాదేవి కోరడంతో తను బయటకు వచ్చి ఏ ప్రదేశంలో కొలువై ఉండాలో తెలియజేస్తుంది.
ఈ విధంగా సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి తాను పసుపుకుంకుమలో కొలువై ఉంటానని చెప్పారు.అందుకే ఏదైనా శుభకార్యాలలో పసుపు కుంకుమకు అంత ప్రాధాన్యత ఇస్తాము పెళ్లి పత్రికలకు కూడా పసుపు కుంకుమ రాయటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఆహ్వానించినట్లు ఇలా పసుపు కుంకుమ రాయడం వల్ల ఆ పెళ్ళిలో ఎలాంటి ఆటంకం లేకుండా తన కృప నూతన వధూవరులు పై ఉంటుందని భావిస్తారు. అందుకే వివాహ ఆహ్వాన పత్రికలకు పసుపు కుంకుమలను రాస్తారని పండితులు చెబుతున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World