Temple: వీలు దొరికినప్పుడు గుడికి వెళ్తున్నారా… అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Temple: సాధారణంగా మనం ప్రతి రోజూ లేదా ఏదైనా ప్రత్యేక రోజులలో స్వామి వారిని దర్శించుకోవడం చేస్తుంటారు. అయితే కొందరు ఉదయమే గుడికి వెళ్లగా మరికొందరు సాయంత్రం వెళ్తుంటారు. అదేవిధంగా మరికొందరు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వారికి సమయం దొరికనప్పుడు గుడికి వెళ్లి వస్తుంటారు. అయితే ఇలా వీలు దొరికినప్పుడు గుడికి వెళ్లే వారు తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.మనకు వీలు దొరికినప్పుడు కాకుండా గుడికి వెళ్లడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మరి గుడికి ఏ సమయంలో వెళ్లడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్లే వారు ఉదయం గుడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం మంచిది. ఉదయం స్వామివారికి తులసిమాల, తులసి తీర్థం ప్రసాదంగా అందజేస్తారు. ఈ విధంగా ఉదయమే తులసి తీర్థం తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. అలాగే స్వామివారి పూమాల అలంకార ప్రియత్వాన్ని కల్గిస్తుంది. అందుకే ప్రతి రోజూ ఉదయమే మహావిష్ణువు ఆలయాలను దర్శించడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి.

ఇక సాయంత్రం పరమేశ్వరుడి ఆలయాన్ని దర్శించాలి. సాయంత్రం శివుడి ఆలయానికి వెళ్లిన వారికి మారేడు దళాల తీర్థం, భస్మం ప్రసాదంగా ఇస్తారు.మారేడు నీరు జీర్ణకోశాన్ని శుభ్రపరుస్తుంది. భస్మం ఒక తీరు వైరాగ్య దృష్టిని కల్గజేస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయం విష్ణు ఆలయాలు సాయంత్రం శివడి ఆలయాలను దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది. అంతేకానీ మనకు వీలు దొరికినప్పుడల్లా గుడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం మంచిది కాదు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel