...

Business idea: కొబ్బరిచిప్పలతో అదిరిపోయే బిజినెస్ ఐడియా.. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది..!

Business idea: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఎందుకూ పనికి రావనుకుని పడేసి కొబ్బరి చిప్పలతో ఓ వ్యక్తి లక్షలు సంపాదిస్తున్నాడు. స్వయంగా ఉపాధి పొందుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన పిచ్చేటి ప్రసాద్ కొబ్బరి చిప్పలతో బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతని బిజినెస్ తో అతనికి కొబ్బరి ప్రసాద్ అనే పేరు వచ్చింది.

కొత్తగూడెంలోని గాజుల రాజం బస్తీకి చెందిన పిచ్చేటి ప్రసాద్ ఊర్లోనూ ఉంటూ టైలరింగ్ చేసే వాడు. కుట్టు మిషన్లు రిపేర్ చేస్తూ ఎంతో కొంత సంపాదించే వాడు. ఆ సంపాదనతోనే కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. కానీ అతని జీవితాన్ని కరోనా తలకిందులు చేసింది. లాక్ డౌన్ సమయంలో దుకాణం మూతపడిపోయింది. శుభకార్యాలు లేక గిరాకీ రాక ఆదాయం రాలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

టైలరింగ్ బిజినెస్ సరిగ్గా కలిసి రావడం లేదని అనుకున్నాడు. ఆ సమయంలోనే అతనికి ఓ ఐడియా తట్టింది. ఎండు కొబ్బరి చిప్పలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని తెలుసుకున్న ప్రసాద్.. దానిని బిజినెస్ గా మార్చుకోవాలని అనుకున్నాడు. అందుకు కొంత అధ్యయనం చేశాడు. ఆపై కొబ్బరి చిప్పలను సేకరించేందుకు ఆలయాల కార్యనిర్వాహక విభాగంతో ఒప్పందం చేసుకున్నాడు.

పచ్చి చిప్పలను ఆరబెట్టి, తక్కువ వేడి సెగ తగిలించి… ఆపై చిప్పలుగా మర్చే కుటీర పరిశ్రమను ఇంట్లోనే ఏర్పాటు చేశాడు. తన కష్టార్జితాన్నే పెట్టుబడిగా పెట్టి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎండు కొబ్బరిని కొనుగోలు చేసే కేరళ, ఆంధ్రాలోని పరిశ్రమలతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రతి నెల టన్నుల్లో ఎండు కొబ్బరిని సరఫరా చేస్తున్నాడు. ఎండు కొబ్బరిని క్వింటాకు రూ.12 వేలు వస్తోందని చెబుతున్నాడు.