Business idea : నూనె ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దినదినం పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో నూనెల ధరలు పెరిగినా, తగ్గినా చాలా కాలం పాటు లాభాలు పొందడానికి చక్కనైన బిజినెస్ ఐడియా నూనె మిల్లు ఏర్పాటు. తక్కువ పెట్టుబడితో నూనె మిల్లును గ్రామాల నుండి నగరాల దాకా ఎక్కడైనా ప్రారంభించొచ్చు. ఎలా మెదలు పెట్టాలి, లాభాలు ఏమేరకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వంట నూనెలు విరివిగా వాడే మన దేశంలో ఆయిల్ మిల్లుల ఎన్ని పెట్టినా డిమాండ్ తగ్గదు. ఆవాల నుండి వేరు శనగ దాకా.. కొబ్బరి నుండి పొద్దు తిరుగుడు దాకా పలు వివిధ రకాల నూనెల ఉత్పత్తిని చిన్న స్థాయి నుండి కూడా ప్రారంభించొచ్చు. ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ మెషిన్ అవసరం. ఒక్కసారి పెట్టుబడి పెడితే సుదీర్ఘ కాలం పాటు లాభాలు పొందవచ్చు ఈ వ్యాపారంలో.
ఆయిల్ మిల్లు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ముందుగా ఏ రకమైన నూనె ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో దానికి అనువైన ఆయిల్ ఎక్స్ పెల్లర్ యంత్రాన్ని కొనుగోలు చేయాలి. ఆవాల నూనె మిల్లయితే ఖరీదు రూ. 2 లక్షలు ఆయిల్ మిల్లును ఏర్పాటు చేయడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ తో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి.
పూర్తి స్థాయిలో ఆయిల్ మిల్ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3 లక్షల నుండి 4 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టాలి. మిల్లును భారీ పరిమాణంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఖర్చు కూడా పెరుగుతుంది.
Read Also : Business idea : కేవలం రూ. 70 వేలతో అదిరిపోయే బిజినెస్.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన..!