వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

EPFO Refund : మీ పాత PF ఖాతాలో డబ్బులు ఉన్నాయా? మీ బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా పడొచ్చు, ఎలాగంటే?

By Ramesh Babu

Published on: February 25, 2026 7:05 AM

Updated on: February 25, 2026 7:06 AM

Follow Us

EPFO refund inactive accounts

---Advertisement---

  • పీఎఫ్ ఖాతాదారులకు EPFO భారీ గిఫ్ట్ అందిస్తోంది
  • 7 లక్షల ఇన్ యాక్టివ్ ఖాతాల నుంచి డబ్బును రీఫండ్ చేస్తోంది
  • మీ బ్యాంకు ఖాతాకు డబ్బు ఎప్పుడైనా క్రెడిట్ అయ్యే ఛాన్స్
  • మీ పాత పీఎఫ్ ఖాతాలో డబ్బులు ఉన్నాయో చెక్ చేసుకోండి

EPFO Refund : పీఎఫ్ ఖాతాదారులకు అద్భుతమైన వార్త. దేశంలోని లక్షలాది మంది ఉద్యోగుల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది. పాత ఉద్యోగాలను వదిలివేసిన తర్వాత చాలామంది పీఎఫ్ ఖాతాదారులు చిన్న బ్యాలెన్స్‌లతో పీఎఫ్ ఖాతాలను విస్మరిస్తున్నారు. దీని కారణంగా కోట్లాది రూపాయలు అలాగే ఉండిపోయాయి.

ఇప్పుడు ప్రభుత్వం రూ. 1000 లేదా అంతకంటే తక్కువ డిపాజిట్ చేసిన ఇన్ యాక్టివ్ ఈపీఎఫ్ఓ ​​ఖాతాలన్నింటికీ ఆటోమాటిక్‌గా ఖాతాదారులకు చెల్లించాలని నిర్ణయించింది. బిగ్ రిలీఫ్ కలిగించే విషయం ఏమిటంటే.. ఈ డబ్బును పొందడానికి మీరు ఏ పీఎఫ్ ఆఫీసు లేదా మీ పాత ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంతకీ పాత పీఎఫ్ డబ్బులు మీ బ్యాంకు అకౌంట్లలో ఆటో ట్రాన్స్ ఫర్ ఎలా అవుతాయి? ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

EPFO Refund : మీ ఖాతా కూడా పనిచేయడం లేదా? :

పీఎఫ్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి లేదా కంపెనీ నుంచి వరుసగా 36 నెలలు అంటే.. 3 సంవత్సరాలు కొత్త కాంట్రిబ్యూషన్స్ డిపాజిట్ చేయకపోతే ఆ అకౌంట్ ఇన్ యాక్టివ్ అవుతుంది. ప్రస్తుతం, EPFO ​​వద్ద దాదాపు 31.86 లక్షల ఇన్ యాక్టివ్ అకౌంట్లు ఉన్నాయి.

Read Also : UPSC Success Story : టీ అమ్మే వ్యక్తి కొడుకు IAS అధికారి ఎలా అయ్యాడు? దేశాల్ దాన్ చరణ్‌ సక్సెస్ స్టోరీ!

ఇందులో రూ. 10,903 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ప్రభుత్వం మొదట రూ. 1,000 కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్న 7.11 లక్షల ఖాతాలను గుర్తించింది. ఈ ఖాతాలలో జమ చేసిన మొత్తం రూ. 30.52 కోట్లు నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.

డబ్బు ఎలా పొందాలి? ప్రాసెస్ ఏంటి? :
ఆటోమేటిక్ పేమెంట్.. కార్మిక మంత్రిత్వ శాఖ ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేదని నిర్ణయించింది. పీఎఫ్ ఖాతాలు వారి ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి. వారి బ్యాంక్ వివరాలు (KYC) అప్ డేట్ చేసి ఉండాలి. అంతే.. ఖాతాదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఫండ్స్ జమ అవుతాయి. అసలు ఖాతాదారుడు మరణించినట్లయితే, ఆ మొత్తాన్ని వారి రిజిస్టర్డ్ నామినీ లేదా చట్టపరమైన వారసుడికి అందుతుంది.

EPFO 3.0 కింద సెటిల్మెంట్ 3 రోజుల్లోనే :

కేంద్ర ప్రభుత్వం పాత ఖాతాలను క్లీన్ చేయడమే కాదు.. మొత్తం సిస్టమ్ ‘హైటెక్’గా మారుస్తోంది. EPFO 3.0 ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రధాన మార్పులు చేస్తోంది. కొత్త డిజిటల్ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత PF క్లెయిమ్‌లకు ప్రస్తుత 20 రోజుల సెటిల్‌మెంట్ సమయం కేవలం 3 రోజులకు తగ్గింది. రిస్క్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న క్లెయిమ్‌లను ఎలాంటి అధికారిక పరిశీలన లేకుండా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా వెంటనే అప్రూవల్ చేస్తుంది. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతతో చేస్తుంది.

ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం :
పీఎఫ్ ఖాతాదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు మంత్రిత్వ శాఖ ఇప్పుడు రెగ్యులర్ రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తోంది. భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఫండ్స్ ఉన్న ఇన్ యాక్టివ్ అకౌంట్లలో కూడా ఇదే విధంగా పరిష్కారం లభించేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్య పాత EPFO ​​డేటాబేస్‌ను క్లియర్ చేయడమే కాకుండా, లక్షలాది మంది ఉద్యోగులు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి పొందవచ్చు.

, , , ,

Join our WhatsApp Channel