Business idea: మీరు సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా.. కానీ ఏది చేయాలో, ఎలా చేయాలో తెలియకు సతమతమవుతున్నారా.. అయితే మీకోసమే మేం ఓ మంచి బిజినెస్ ఐడియా చెప్తాం, ఈ రోజుల్లో క్యాటరింగ్ బిజినెస్ కు మాంచి డిమాండ్ ఉంది. మారిన ఉరుకుల పరుగుల జీవన విధానంలో ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ కు ఇవ్వడానికే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని బిజినెస్ గా ఏఎంచుకొని మంచి లాభాలు ఆర్జించవచ్చు. కేవలం 10 వేల రూపాయలతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఇంత తక్కువ ఖర్చుతో బిజినెస్ స్టార్ట్ చేసి… దాదాపు నెలకు 25 నుంచి 50 వేల వరకూ సంపాదించొచ్చు. కానీ వ్యాపారం పెరుగుతున్నా కొద్దీ మీరు కనీసం లక్ష రూపాయల వరకూ లాభం పొందుతారు.
మీరు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా కేటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు రేషన్ మరియు ప్యాకేజింగ్ లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు పరిశుభ్రత పాటించడానికి చాలా ఇష్టపడతారు. దీని కోసం మీరు శుభ్రమైన వంట గదిని కల్గి ఉండాలి. క్యాటరింగ్ వ్యాపారంలోకి వెళ్లాలనుకునే వాళ్లు.. సర్వీస్ గురించి ఆన్ లైన్ లో మరియు స్నేహితుల ద్వారా ప్రచారం చేయండి. క్రమంగా మీకు ఆర్డర్లు రావడం ప్రారంభం అవుతుంది. ఈ బిజినెస్ కో సం మీ వద్ద కనీసం 10 వేల రూపాయలైనా ఉండాలి.