Weather Report : భానుడి భగభగతో మండిపోతున్న జనాలు.. గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

Heatwave in parts of telangana
Heatwave in parts of telangana

Weather Report : భానుడు తన మంటలతో ప్రజలను అల్లాడిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఎండలకు బెంబేలెత్తిపోతున్నారు. మండుటెండలు, ఉక్కపోత పౌరులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు పగటి పూటా అల్లాడిస్తుండగా. రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదు అవుతున్నాయి.

Heatwave in parts of telangana
Heatwave in parts of telangana

తెల్లవారుజాము నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే… నిప్పుల్లో అడుగు పెట్టినట్లుగా అల్లాడిపోతున్నారు. ఏదైనా అవసరం నిమిత్తం ఆరు బయటకు వెళ్లాలన్నా ఈ తీవ్ర ఎండలకు భయపడిపోతున్నారు. వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. ఎండలు, వడగాల్పుల భయంతో చాలా మంది బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప… ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కుబీర్, ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ లలో అత్యధికంగా 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ములుగు జిల్లాలోని మేడారంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, ఆదిలాబాద్ అర్బన్, నిర్మల్ జిల్లాలోని తానూర్ లలో 42.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Advertisement

Read Also : Astrology: కుంభ రాశిలోకి ప్రవేశించనున్న శని… శని ప్రభావంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Advertisement