Weather report : రాష్ట్రంలో నేడు పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. అయితే హైదరాబాద్ లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఉపరితల ద్రోణి ఇవాళ ఈశాన్య మధ్య ప్రదేశ్ నుంచి విధర్భ, మరాట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం సంచాలకులు చెప్పారు. అయితే ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దూరపు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదని వివరించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అంతే కాకుండా బయటకు వెళ్లే వాళ్లు గొడుగులు వంటివి వెంట తీసుకెళ్లడం వల్ల వర్షం నుంచి తప్పించుకోవచ్చని వివరిస్తున్నారు.
Read Also :Weather Report : భానుడి భగభగతో మండిపోతున్న జనాలు.. గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?