Weather changes in hyderabad : హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయాయి. భానుడి భగభగలతో అడుగు బయట వేసేందుకు ప్రజలు భయపడిపోయారు. ఉదయం 7 గంటల నుంచి సూర్యుడు నిప్పులు కురిపించాడు. అయితే అంతగా మండిపోయిన సూర్యుడు ఒక్కారిగా చల్లబడ్డాడు. దాదాపు గంట సేపు ఈదురు గాలులు వచ్చాయి. భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ లో తేలిక పాటి వర్షం కురిసింది.

Weather changes in hyderabad
Weather changes in Hyderabad

అయితే ప్రతిరోజూ ఎండలతో అలిసిపోయిన పట్టణ వాసులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇళఅల నుంచి బయటకు వచ్చి చల్లదన్నాని పొందుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అంతా బయటే చేరి చల్లబడ్డ వాతావరణాన్ని చూసి మురిసిపోతున్నారు. అయితే ఇంకా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. రాత్రంతా వాతావరణం ఇలాగే చల్లగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ హాయిగా ఈ రోజుని ఎంజాయ్ చేయండి. ఏసీలకు సెలవిచ్చి ప్రకృతి ఇచ్చే చల్లటి గాలిని ఆస్వాదించండి.

Advertisement

Read Also : Weather Report : భగభగమంటున్న భానుడు.. గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

Advertisement