Weather Report : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా లక్ష్మపూర్లో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ నార్త్, ఆదిలాబాద్ భోరాజ్లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మెట్పల్లి, ఆలిపూర్, ఆదిలాబాద్ జిల్లా చాపర్లలో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కుమురం భీం ఆసిఫాబాద్ లో కౌతాలా, నిజామాబాద్ జిల్లాలోని పల్దాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో, జగిత్యాల్ జిల్లా వెల్గటూర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 44.2 డిగ్రీల సెల్సియయస్ ఉఫ్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే పెద్దపల్లి జిల్లా అక్కెనపల్లి, ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం వేల కూడా బయటకు రాలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక జ్యూస్ లు, కొబ్బరి బోండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
Read Also : New rule for bikers: బైకుపై వెనక సీట్లో పురుషులు కూర్చోవద్దట.. ఎక్కడో తెలుసా?