వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

New rule for bikers: బైకుపై వెనక సీట్లో పురుషులు కూర్చోవద్దట.. ఎక్కడో తెలుసా?

ద్విచక్ర వాహనంపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు. ఎవరైనా అలా కూర్చొని వెల్తే కఛినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ఘటన కేరళలోని పాలక్కడ్ లో చోటు చేసుకుంది. ఓ ఆర్​ఎస్ఎస్ వర్కర్​ను ఎస్​డీపీఐ కార్యకర్త హత్య చేసినట్లు భావిస్తున్న కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ హత్యకు.. బైకుపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడాన్ని నిషేధించడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్​ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్​ ... Read more

By Vinod Kumar

Published on: April 19, 2022 12:47 PM

Updated on: April 19, 2022 12:47 PM

---Advertisement---

ద్విచక్ర వాహనంపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు. ఎవరైనా అలా కూర్చొని వెల్తే కఛినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ఘటన కేరళలోని పాలక్కడ్ లో చోటు చేసుకుంది. ఓ ఆర్​ఎస్ఎస్ వర్కర్​ను ఎస్​డీపీఐ కార్యకర్త హత్య చేసినట్లు భావిస్తున్న కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ హత్యకు.. బైకుపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడాన్ని నిషేధించడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్​ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్​ షాప్​కు టూవీలర్​పై ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పట్టపగలే అతడిని హత్య చేశారు. ఏప్రిల్ 15న ఎస్​డీపీఐ కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగా ఈ దారుణం​ జరిగినట్లు తెలుస్తోంది. 24 గంటల వ్యవధిలో జంట హత్యలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం ఉందని భావించిన అడిషన్​ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్​.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel