Health Tips: వేసవి కాలం మొదలై రోజు రోజుకి ఉష్ణోగ్రత తీవ్రత పెరిగిపోతోంది. ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల తరచు శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది.తద్వారా వాంతులు-విరేచనాలు, కళ్ళు తిరగటం, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. అయితే వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి చాలామంది ఎక్కువ నీటి శాతం కలిగిన పండ్లను తినటం, నీరు, జ్యూస్ వంటివి ఎక్కువ తాగుతూ ఉంటారు. కానీ వేసవి కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది.వేసవి కాలంలో ప్రతి రోజు ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతిరోజు ఉల్లిపాయలు మనం ఆహారం తయారు చేయటానికి వినియోగిస్తూ ఉంటాము. ఉల్లిపాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే అనేక రకాల ఔషధ గుణాలు మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి రోజు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వేసవికాలంలో ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఇది శరీరంలోని వేడిని తగ్గించి శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి మూత్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఉల్లిపాయ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొంచెం కలాకండ్ కలిపి తినటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
ఉల్లిపాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించి సీజనల్ వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది. షుగర్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఉల్లిపాయ తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా ప్రతి రోజు ఉల్లిపాయ తినడం వల్ల మెరుగుపడి సంబంధిత వ్యాధులు తలెత్తకుండా ఉంటాయి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World