...

Group 1 Notification : గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…!

Group 1 Notification : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీపీఎస్సీకి సంబంధించి 292 పోస్టుల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 110 గ్రూప్-1 పోస్టులు, 182 గ్రూప్-2 పోస్టులు కలిపి మొత్తం 292 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

అయితే గతంలో గ్రూప్ 1, 2 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన పోస్టుల కంటే ఇవి ఎక్కువ ఉండడం నిరుద్యోగులకు నిజంగా శుభవార్తే. గతంలో కేవలం 36 పోస్టులు మాత్రమే ఉన్నట్లు జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన ప్రభుత్వం… ప్రస్తుతం 292కు పెంచడం హర్షణీయం. గ్రూపు-1 పోస్టుల్లో.. 10 డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు. 7 ఆర్టీవో, 12 కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే గ్రూప్-2 లో 182 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో డిప్యూటీ తహసీల్దార్లు పోస్టులు 30 ఉన్నాయి.

Advertisement
Group 1 Notification
Group 1 Notification

16 సబ్‌రిజిస్ట్రార్లు, 15 అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సహకార శాఖ, 5 పురపాలక కమిషనర్లు, 10 డిప్యూటీ కలెక్టర్‌లు, 7 రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారి 7, 12 కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి, 6 జిల్లా రిజిస్ట్రార్‌, ఒక జిల్లా గిరిజన సంక్షేమాధికారి, మరొక జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, 3 జిల్లా బీసీ సంక్షేమ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 13 డీఎస్పీ, 2 డీఎస్పీ, 2 జిల్లా అగ్నిమాపక అధికారి, 3 అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, ఒక పురపాలక కమిషనర్‌, 8 పురపాలక కమిషనర్‌, 2 డిప్యూటీ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌ విభాగం, 5 ట్రెజరర్‌ గ్రేడ్‌2, 8 ఏటీఓ/ఏఏఓ, 4 ఏఏఓ, 15 ఏఓ, 7 ఎంపీడీఓ పోస్టులు ఉన్నాయి.

Advertisement

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

Advertisement
Advertisement