Group-1 notification : తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు గ్రూప్-1 పోస్టుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక తొలి సారి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ను టీఎస్ పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారానే ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అయితే ఇంటర్వూలు లేకుండా తీసుకుంటామని మొన్నే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే నిన్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజైంది. అయితే మొత్తం 17 వేల 99 పోస్టులు ఖాళీగా ఉండగా… అందులో 587 ఎస్సై పోస్టులు.. 16, 027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 414 సివిల్ ఎస్ఐలు, 66ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే విషయం తెలుసుకున్న తెలంగాణ యువత ఆనందంతో ఉబ్బితబ్బిపవుతున్నారు. ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అంతేనా ఫోన్లు పక్కన పడేసి మరీ ఇళ్లలోనే ఉంటూ దాదాపు 15 గంటల వరకు చదువుతున్నారు.
Read Also :TSPSC Groups: గ్రూప్స్ నియామక పరీక్షలకు ఇక ఇంటర్వ్యూలు ఉండవట..!