Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

TSPSC Groups: గ్రూప్స్ నియామక పరీక్షలకు ఇక ఇంటర్వ్యూలు ఉండవట..!

భారీ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం గ్రూప్స్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలను తొలగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 80 వవేలకు పైగా పోస్టుల భర్తీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో గ్రూప్ వన్ పోస్టులు 503 కాగా… గ్రూప్ టూ ఉద్యోగాలు 582, గ్రూప్ త్రీ కాటగిరీలో 1373, గ్రూప్ ఫోర్ కింద 9 వేల 168 పోస్టులున్నాయి. ఇందులో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ... Read more

By Vinod Kumar

Published on: April 7, 2022 6:47 AM

Updated on: April 7, 2022 6:47 AM

---Advertisement---

భారీ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం గ్రూప్స్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలను తొలగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 80 వవేలకు పైగా పోస్టుల భర్తీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో గ్రూప్ వన్ పోస్టులు 503 కాగా… గ్రూప్ టూ ఉద్యోగాలు 582, గ్రూప్ త్రీ కాటగిరీలో 1373, గ్రూప్ ఫోర్ కింద 9 వేల 168 పోస్టులున్నాయి. ఇందులో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతి ఇచ్చింది. అయితే అన్ని పోస్టుల నియామకానికి ఇటర్వ్యూలు లేకుండానే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆచోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గ్రూప్ టూ లోని కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు లేకపోగా.. మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూలో 75 మార్కులు ఉన్నాయి. గ్రూప్ వన్ పోస్టులకు ఇంటర్వ్యూలో వంద మార్కులు ఉంటాయి. అయితే అన్నింటికి ఇంటర్వ్యూ లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేవలం మార్కుల ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక చేపట్టాలని యేచిస్తున్నట్లు తెలుస్తోంది.

,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.