Parenting Tips: మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఓ గొప్ప వరం.ఇలా మహిళ తల్లి కాబోతుందనే విషయం తెలియగానే బిడ్డకు జన్మనిచ్చే వరకు తన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.ఈ విధంగా గర్భిణీ మహిళలు సరైన సమయానికి పోషక విలువలు కలిగినటువంటి ఆహారపదార్థాలను తీసుకున్నప్పుడే తన బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉండి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు.సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భందాల్చిన మహిళలకు అధిక మోతాదులో శక్తి అవసరం అలాగే తన బిడ్డ ఎదుగుదలకు రక్తం కూడా అవసరం అవుతుంది కనుక గర్భం దాల్చిన మహిళలకు ఎక్కువగా ఐరన్ అవసరమవుతుంది.ఎవరికైతే ఐరన్ లోపం ఉంటుందో అలాంటి వారు రక్తహీనత సమస్యతో బాధపడుతూ ముందుగా డెలివరీ కావడం లేదా బిడ్డ ఎదుగుదలలో లోపాలు ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి.ఈ విధంగా రక్తహీనత సమస్యతో బాధపడే గర్భిణీ స్త్రీలు ప్రతి రోజు వారి డైట్ లో ఈ జ్యూస్ చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి ఆ జ్యూస్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
పుచ్చకాయ – జామ జ్యూస్: పుచ్చకాయ, జామాలో విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటుంది.కనుక ఈ రెండింటిని కలిపి జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మన శరీరానికి కావలసినంత ఐరన్ లభించడంతో రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు.
యాపిల్ జ్యూస్:
గర్భిణీ స్త్రీలు రక్తహీనత సమస్య నుంచి బయటపడటానికి యాపిల్ చూసి ఎంతో ఉపయోగపడుతుంది. యాపిల్ జ్యూస్ లో కూడా విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వారి శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి దోహద పడుతుంది. కేవలం ఆపిల్ జ్యూస్ మాత్రమే కాకుండా పాలకూర జ్యూస్ కూడా ఎంతో దోహదపడుతుంది. ఆకుపచ్చ ఆకుకూరలను, పండ్లను కూరగాయలను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్స్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు ప్రతి రోజు బీట్ రూట్ జ్యూస్ తాగటం కూడా ఎంతో మంచిది. బీట్ రూట్ లో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇలా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడానికి బీట్ రూట్ జ్యూస్ దివ్యౌషధమని చెప్పవచ్చు.