Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అలాగే ఆహారపు అలవాట్ల కారణంగా అతి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు ఏర్పడుతూ వృద్ధాప్య ఛాయలు కనబడుతున్నాయి.అయితే మొహం పై ఏర్పడిన ఈ ముడతలు తొలగించుకోవడం కోసం మార్కెట్లో లభించే ఎన్నో సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించినప్పటికీ కొందరిలో ఎలాంటి ఫలితం ఉండదు. ఇలా ఫలితం లేకపోగా మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా చర్మం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే ఎలాంటి సమస్యలు లేకుండా మొహం పై ఉన్న ముడతలు తొలగిపోవాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు..
మొహం పై ఏర్పడిన ముడతలు తొలగిపోవాలంటే బాదం ఆయిల్ ఎంతో చక్కని పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.బాదం నూనెలో పోషకాలు సమృద్ధిగా లభించడం వల్ల చర్మం పై ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా తొలగిస్తుంది. బాదం నూనెను తరచు మొహానికి మర్దన చేయడం వల్ల చర్మ గ్రంథులు తెరచుకుని చర్మ కణాలకు ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. అదేవిధంగా ఈనూనెతో బాగా మసాజ్ చేయడం వల్ల చర్మం పై ఉన్నటువంటి మృతకణాలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా ఉంటుంది.
బాదం నూనెలో ఉన్నటువంటి విటమిన్ ఏ, ఈ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభించడం వల్ల ఎన్నో రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కాటన్ సహాయంతో బాదం నూనెను తీసుకొని ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం పై ఉన్న మచ్చలు తొలగిపోవడమే కాకుండా ముడతలు సైతం తొలగిపోయి ఎంతో యవ్వనంగా కనిపిస్తారు.ఈ బాదం నూనె ఉపయోగించడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.