Diabetes Control Tips : ప్రపంచవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తున్న డయాబెటిస్ (Diabetes Control) మహమ్మారి. ఈ డయాబెటిస్ పేరు వింటే చాలు.. భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే.. ఈ షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. జీవితాంతం మందులు వాడాల్సిందే అంటుంటారు. అతి చిన్న వయసులోనే నోటిని అదుపులోకి పెట్టుకోవాల్సి వస్తుంది. షుగర్ కారణంగా అందరిలాగా ఏది పడితే అది తినే పరిస్థితి ఉండదు. అలానే తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి అత్యంత ప్రమాదకరంగా మారిపోతుంది. అందుకే వైద్యులు కూడా షుగర పేషెంట్లను అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. షుగర్ వచ్చినవాళ్లు కార్బొహైడ్రేట్స్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే, కొన్నిసార్లు ఎంతగా డైట్ పాటించినా షుగర్ కంట్రోల్ కావడం లేదని చెబుతుంటారు. అయితే ఎలాంటి షుగర్ అయినా కొద్దిరోజుల్లోనే నార్మల్ లోకి రావాలంటే అద్భుతమైన చిట్కా ఒకటి ఉంది.
ఈ చిట్కా ఒక వారం పది రోజుల పాటు పాటిస్తే చాలు.. ఎంత షుగర్ అయినా దెబ్బకు కంట్రోల్ కావాల్సిందే.. ఇంతకీ ఆ చిట్కా ఏంటో తెలుసా? షుగర్ వ్యాధితో బాధపడేవారంతా ఆహార నియమాలను తప్పక పాటించాలి. అలాగే ఇప్పుడు చెప్పబోయే హోం రెమడీని ఇంట్లోనే తయారు చేసుకుని ఒక వారం పదిరోజులు తాగి చూడండి.. ఆ అద్భుతాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? అంతేకాదు.. ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా షుగర్ శాశ్వతంగా తగ్గిపోతుంది. మందులు వాడాల్సిన అవసరం లేకుండా షుగర్ తక్కువ సమయంలోనే నియంత్రణలోకి తీసుకురావచ్చు. చాలామంది ఈ కషాయం చిట్కాను పాటించి అద్భుతమైన ఫలితాలు పొందారు. ఇంతకీ ఈ కషాయాన్ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Diabetes Control Tips : కషాయంతో శాశ్వతంగా షుగర్ మాయం..
ముందుగా.. కషాయాన్ని తయారు చేయడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏంటో చూద్దాం.. వంటింట్లో దొరికే మెంతులు షుగర్ కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే దాల్చిన చెక్క పొడి, పసుపును కూడా తీసుకోండి. ఈ మూడు వస్తువులను కలిపి ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో నీళ్లు పోయాలి. ఒక టీ స్పూన్ మెంతులను వేయాలి. అర టీ స్పూన్ పసుపు, చిటికెడు దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నెను ఉంచి 10 నుంచి 15 నిమిషాల వరకు ఆ నీటిని బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లో పోసుకోవాలి. అయితే తయారుచేసుకున్న ఈ కషాయాన్ని ప్రతిరోజూ పరగడుపున గోరు వెచ్చగా తాగాల్సి ఉంటుంది.
క్రమం తప్పకుండా ఒక వారం పది రోజుల పాటు కషాయాన్ని తీసుకోండి. అంతే.. మీ ఒంట్లో షుగర్ వ్యాధి కంట్రోల్ కి వచ్చేస్తుంది. పసుపు, దాల్చిన చెక్క, మెంతుల్లో ఔషధ గుణాలు, పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదండి.. మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వెంటనే తగ్గిపోతాయి. గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. అజీర్తి, మలబద్దకం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా షుగర్ సమస్యతో బాధపడుతున్నారా? వెంటనే ఈ కషాయాన్ని తయారుచేసుకుని ఒక వారం పాటు తాగి చూడండి.. మీ షుగర్ స్థాయిలో మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు.
Read Also : Pumpkin Benefits: గుమ్మడికాయతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే వదిలిపెట్టరు