Pumpkin Benefits: గుమ్మడికాయతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. గుమ్మడి కాయలోని గుజ్జూ, వాటి గింజలు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఈ మధ్యకాలంలో చాలా మందిలో గుండె ఆరోగ్యం దెబ్బ తింటోంది. వయసు పైబడిన వారిలోనే కాకుండా యువతలోనూ గుండె సమస్యలు వస్తున్నాయి. రోజూ గుమ్మడి కాయ గింజలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు నిపుణులు. ఈ గింజలు ఆరోగ్యంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గుమ్మడి కాయను డైరెక్ట్ గా కూరగా చేసుకుని తినవచ్చు. అలాగే గుమ్మడి జ్యూస్ కూడా బాగుంటుంది.
వీటితో పాటు గుమ్మడిలోని గింజలను ఎండబెట్టి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుమ్మడి గింజల్లో కొవ్వులు, మెగ్నీషియం, జింక్, ఐరన్ సహా ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పంప్కిన్ సీడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు గుమ్మడిలో ఉంటాయి. గుమ్మడి గింజల్లోని ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, విటమిన్ బి2 శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే వీటితో పాటు గుమ్మడి గింజలు తినడం వల్ల మధుమేహం రాదు. రక్తంలో చక్కెర స్థాయిలను సక్రమంగా నిర్వహించేందుకు ఇవి తోడ్పడతాయి. వీర్యం నాణ్యతను మెరుగుపరచడంలో గుమ్మడి గింజలు ప్రభావవంతంగా పని చేస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి.