Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులతో పాటు ఆహారపు అలవాట్లు. అయితే చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు ఈ ఈసమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఈ సమస్యలను తగ్గిచుకోవచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Carom seeds are ery useful for deigestive problems
మన ఇంట్లో దొరికే వామును ఉపయోగించి అజీర్తి ఇంకా గ్యాస్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు వామును చక్కటి పరిష్కారంగా చెబుతారు. వామును ఏ విధంగా ఉపయోగిస్తే… జీర్ణాశయ ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఇప్పుడు చూద్దాం.
వాము వల్ల అజీర్తి, కడుపు, ఉబ్బరం, గ్యాస్ మొదలైన సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియలో ఇబ్బందులను తొలగించి జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. అలాగే అజీర్తి వల్ల కలిగే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. వామును నిమ్మరసంతో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణాశయంలో హైడ్రో క్లోరిక్ యాసిడ్ పునరుద్ధరించబడి ఆహార త్వరగా జీర్ణం అవుతుంది.
Read Also : Dry fruits: డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే!