Intinti Gruhalakshmi Aug 20 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో నందు, సామ్రాట్ లు తాగి రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో లాస్య రూమ్ కార్డు కోసం కిందికి వెళ్ళగా, తులసి కూడా ఫుడ్ తీసుకొని వస్తాను అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు నందు సామ్రాట్ ఇద్దరూ తాగిన మైకంలో తమ్ముడు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నందు సామ్రాట్ తో నీకు ఈవిడ అంటే ఇష్టం కదా అని అనగా నాకు తెలియదు అని అంటాడు సామ్రాట్. అప్పుడు పర్లేదు తమ్ముడు నిజంగా ఇష్టం ఉంటే చెప్పు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను అని అంటాడు.

అప్పుడు సామ్రాట్ అవును నాకు తులసి అంటే చాలా ఇష్టం అని అంటాడు. అప్పుడు నందు, కొన్ని కొన్ని సార్లు తులసి అంటే నేను విడాకులు ఇచ్చేసిన భార్యలా కనిపిస్తూ ఉంటుంది అని అంటాడు. ఎందుకు విడాకులు ఇచ్చేసావు అని సామ్రాట్ అడగగా మాకు పెళ్లయిన తర్వాత అభి పుట్టాడు, ప్రేమ్ పుట్టాడు, దివ్య పుట్టింది, కానీ నాకు తులసి మీద ప్రేమ మాత్రం పుట్టలేదు అని అంటాడు.
Intinti Gruhalakshmi Aug 20 Today Episode : నాకు తులసి మీద ప్రేమ మాత్రం పుట్టలేదన్న నందు
అప్పుడు తులసి గురించి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి లాస్య వస్తారు. ఇప్పుడు లాస్య నందుని తన గదికి తీసుకొని వెళుతుంది. మరొకవైపు పరంధామయ్యకు గుండె నొప్పితో బాధపడుతూ ఉంటాడు. ఒకవైపు తులసి సామ్రాట్ నేను గది లోపలికి తీసుకొని వెళ్లి పడుకోబెడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి 11 అవుతుంది. అది చూసిన సామ్రాట్ టెన్షన్ పడుతూ ఉంటాడు.
అప్పుడు రాత్రి తాగిన మైకంలో అందరూ పడుకున్నాము అని అనగా తులసికి ఏమైంది తన ఉదయాన్నే లేస్తుంది కదా అనడంతో ఇంతలోనే తులసి అక్కడికి వచ్చి మీటింగ్ అయిపోయింది అని చెబుతుంది. అప్పుడు నందు లాస్య తులసి పై విరుచుకుపడుతూ ఉంటారు. సామ్రాట్ వెళ్లి మంచి పని చేశారు కానీ అది పెద్ద ప్రాజెక్టు కదా అని తులసి నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయగా, నేను మిమ్మల్ని నిద్ర లేపడానికి చాలా ట్రై చేశాను కానీ మీరు ఎవరు నిద్ర లేలేదు నేను చేయాల్సిన చేశాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. ఇంతలోనే మీటింగ్ నుంచి వారికి ఫోన్ వస్తుంది. అప్పుడు అందరూ టెన్షన్ పడుతూ కనిపిస్తారు..
Read Also : Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..?