Intinti Gruhalakshmi Aug 24 Today Episode : తులసిపై అనుమాన పడుతున్న అనసూయ, అభి.. సంతోషంలో సామ్రాట్..?

Intinti Gruhalakshmi Aug 24 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి సామ్రాట్ ల విషయం గురించి వచ్చిన ఆర్టికల్ని చదివి నానా రచ్చ చేస్తాడు అభి.  ఈరోజు ఎపిసోడ్ లో అభి,తులసి పై ఫైర్ అవ్వగా ప్రేమ్ తులసికి సపోర్ట్ గా మాట్లాడుతాడు. అప్పుడు అభి మధ్యలో అనసూయని ఇన్వాల్వ్ చేస్తూ మామ్ చేసింది తప్పుగా అనిపించడం లేదా అని పదేపదే అడుగుతాడు. అప్పుడు అనసూయ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో వెంటనే శృతి, అభితో వాడెవడో ఆర్టికల్ రాస్తే తప్పు పడతావా అంటూ అభి పై ఫైర్ అవుతుంది.

Anasuya is worried about Tulasi and Samrat's friendship in todays intinti gruhalakshmi
Anasuya is worried about Tulasi and Samrat’s friendship in todays intinti gruhalakshmi

అప్పుడు దివ్య, పరంధామయ్యలు కూడా తులసికు సపోర్ట్ గా మాట్లాడతారు. అప్పుడు అనసూయ తులసిని వైజాగ్ పంపించకుండా ఉంటే ఈ గొడవ జరిగేది కాదేమో అని అంటుంది. ఆ తర్వాత అభి కి సపోర్ట్ గా మాట్లాడుతుంది అనసూయ. ఆ తర్వాత తులసి గురించి పరంధామయ్య కొన్ని మాటలు చెప్పి లోపలికి వెళ్తుండగా ఇంతలో అక్కడికి తులసి వస్తుంది.

Intinti Gruhalakshmi Aug 24 Today Episode : తులసి చిరకాల స్వప్నం అభి ఆవేశంతో ఆగిపోనుందా..

అప్పుడు తెలిసి ఏమైంది అని అడగగా అప్పుడు పరంధామయ్య అదే విషయాన్ని వేరే విధంగా చెబుతాడు. ఇందులోనే సామ్రాట్ అక్కడికి వచ్చి తులసి గారు మీతో పర్సనల్ గా మాట్లాడాలి అని అనగా వెంటనే అభి మా ఇంట్లో ఏది ఉన్న అందరి ముందు ఓపెన్ గా మాట్లాడాలి అనడంతో అప్పుడు సామ్రాట్ తులసికి ఆ ఆర్టికల్ గురించి చెబుతాడు.

ఎప్పుడు తులసి నావల్ల మీకు చెడ్డ పేరు వచ్చింది ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసి ఇది మీరు సీరియస్ గా తీసుకుంటున్నారా నేనైతే అసలు పట్టించుకోను అనడంతో అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు సామ్రాట్ సంతోషపడగా తులసిటీ ఇస్తాను అని అనగా అప్పుడు సామ్రాట్ వద్దు అన్న కూడా వినకుండా తులసి టీ తెస్తాను అని లోపలికి వెళుతుంది.

అప్పుడు అనసూయ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ఉంటుంది. ఆ తరువాత సామ్రాట్న బాబాయితో జరిగిన విషయాన్ని చెప్పి తులసి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు. తర్వాత అనసూయ పరంధామయ్యతో సామ్రాట్  పై అనుభంగానంగా ఉంది అని అనడంతో తులసి గురించి అలా అనుకోకు అని చెబుతాడు పరంధామయ్య.

Read Also : Intinti Gruhalakshmi Aug 20 Today Episode : గుండె నొప్పితో అల్లాడుతున్న పరంధామయ్య.. తులసి పై కోప్పడిన నందు,లాస్య..?