Body transformation: బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ వీడియాలు చాలా మందే చూసి ఉంటారు. ఒకప్పుడు లావుగా ఉన్న వాళ్లు ఎంతో శ్రమ పడి ఫిట్ గా అవుతుంటారు. అలాంటి వీడియోలు చాలా మందికి ఆదర్శంగా ఉంటాయి. వందల కిలోలు ఉండి జిమ్ లో ఎన్నో కసరత్తులు చేసి ఫిట్ గా అవుతుంటారు. ఇక్కడ చెప్పుకునేది అలాంటి ఓ ఫిట్టెస్ట్ వ్యక్తి గురించే.
లావున్నా ఉన్నావంటూ అతడిని చాలా మంది హేళన చేశారు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా తనను వదిలి వెళ్లి పోయింది. ఇంత లావుగా ఉన్నావంటూ ఛీత్కరించింది. దానిని తట్టుకోలేక పోయాడు ఓ యువకుడు. ఆ కోపాన్ని, ఆవేశాన్ని కసిగా మార్చుకున్నాడు. 144 కిలోలు ఉండే ఆ యువకుడు ఎంతో కష్ట పడి 74 కిలోలకు వచ్చాడు.
కసిగా తన వెయిట్ తగ్గించుకున్నాడు. ఏకంగా 70 కిలోలు తగ్గి చాలా ఫిట్ గా తయారయ్యాడు. తాను లావుగా ఉన్నప్పటి వీడియోలు, ఫోటోలు, అలాగే జిమ్ లో కసరత్తులు చేస్తూ ఫిట్ గా మారిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నావు అంటూ ఆ వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు.
ఏడాది కాలంలో తనను పూర్తిగా మార్చుకుని ఇప్పుడు ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నానని అంటున్నాడు. ప్రస్తుత, గత ఫోటోలో, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘నాకు నేనే ఓ కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నా.. ఒకప్పుడు ఎంతో నీరసంగా ఉండే వాడిని. జనం సైతం నన్ను హేళనగా చూసేవారు. కానీ ఇప్పుడు నా జీవితం తిరిగొచ్చింది. ఆత్మవిశ్వాసంతో ఉంటున్నా’ అని అంటున్నాడు పవి.