Google search: గూగుల్ తల్లి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇష్ట దైవం, ఇంటి దైవం అయిపోయింది. ఏది కావాలన్న మొదట గూగుల్ లో సెర్చ్ చేస్తున్నాం. ఏ చిన్న అంశం గురించి తెలియక పోయినా గూగుల్ లో వెతుకుతున్నాం. అదీ ఇదీ అని కాకుండా మనం వెతికే ప్రతి ఒక్కటీ అందులో దొరుకుతుంది. ఏ టూ జెడ్ అందుబాటులో ఉంటుంది. కేవలం మనకు తెలియాల్సిందల్లా.. గూగుల్ లో ఎలా సెర్చ్ చేయాలన్నదే.
గూగుల్ అనేది అపార జ్ఞాన భాండాగారం. స్టవ్ ఎలా ఆన్ చేయాలన్న దాని నుండి, రాకెట్ సైన్స్ వరకు ప్రతి ఒక్కటీ అందులో ఉంటుంది. కానీ చాలా మందికి వారికి కావాల్సింది ఎలా వెతకాలన్నది తెలియదు. అది ఒక కళ అని టెక్ నిపుణులు అంటుంటారు. అయితే కొందరు ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫోన్ పట్టుకుని ముఖాన్ని ఫన్ లో పెట్టుకునే ఉంటారు. వేళ్లు ఆ టచ్ స్కీన్ పై అలా అలా కదులుతూనే ఉంటాయి. అసలు అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అసలు అమ్మాయిలు ఏం చూస్తున్నారో చెప్పింది గూగుల్ తల్లి.
అమ్మాయిలు ఎక్కువగా గూగుల్ లో సౌందర్యానికి సంబంధించిన వాటి గురించే వెతుకుతున్నారట. గోరింటాకు గురించే వారి సెర్చింగ్ అంట. మెహందీ డిజైన్ల కోసం అమ్మాయిలు గూగుల్ తల్లిని అడుగుతున్నారట. తర్వాత ఎక్కువగా వెతికేది ఆన్ లైన్ షాపింగ్ గురించేనని గూగుల్ నివేదిక వెల్లడించింది.