Sprouts : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వ్యాయామాలు చేయటం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి వాటిని పాటిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి అన్ని రకాల పోషక విలువలను అందించే మొలకెత్తిన గింజలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. మొలకెత్తిన గింజలను ప్రతిరోజు ఉదయం తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. కొంతమంది వీటిని తీసుకునే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు.
సాధారణంగా అందరూ మొలకెత్తిన గింజలను నమిలి తింటూ ఉంటారు. కానీ కొంతమంది వాటిని నమలడానికి ఎక్కువ సమయం కేటాయించలేక జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చాలా పెద్ద పొరపాటు చేసినట్లే. మొలకెత్తిన గింజలను జ్యూస్ చేయడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి సమృద్దిగా అందవు. మొలకెత్తిన గింజలను నమిలి తినటం వల్ల వాటిని నమిలేటప్పుడు నోటిలోని లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మొలకెత్తిన విత్తనాలలో ఉండే కార్బోహైడ్రేట్లను తొందరగా జీర్ణం కావటానికి లాలాజలం దోహదపడుతుంది.
మొలకెత్తిన విత్తనాలను నమిలి తిన్నప్పుడు వాటిని జీర్ణం చేయటానికి జీర్ణాశయం పేగులలోని కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ రసాయనాలు మొలకెత్తిన విత్తనాలు లోనే పోషకాలను గ్రహిస్తాయి. తద్వారా ఈ పోషకాలు అన్ని శరీర భాగాలకు సమృద్ధిగా అందుతాయి. కానీ మొలకెత్తిన విత్తనాలను జ్యూస్ చేసి తాగటం వల్ల ఇందులో ఉండే పోషకాలు మల విసర్జన ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ఈ విత్తనాలను జ్యూస్ చేసే తాగటం వల్ల వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మొలకెత్తిన గింజలలో ఎండు ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని జత చేసుకుని తినడం వల్ల ఇంకా ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి.
Read Also : Health Tips : బరువు తగ్గాలి అనుకునే వారికి బెస్ట్ టిప్ ఇదే… ట్రై చేయండి!
Tufan9 Telugu News And Updates Breaking News All over World