Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

Vastu Tips : జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. ఇది లేనిదే ఏ పని జరుగదు. దీని లోటు వల్ల చాలాసార్లు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. …

Read more

Updated on: January 22, 2024

Vastu Tips : జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. ఇది లేనిదే ఏ పని జరుగదు. దీని లోటు వల్ల చాలాసార్లు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ ఇంట్లో వాస్తు నియమాలు సరిగా లేకుంటే డబ్బులోటు ఏర్పడుతుంది. ఇంట్లో మీ లాకర్‌ని ఉంచే దిశ కూడా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే సరైన దిశలో డబ్బుని దాచడం ముఖ్యం. డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఆకర్షించడానికి ఈ వాస్తు చిట్కాలను అనుసరించవచ్చు.

మీ లాకర్‌ను మీ ఇంటికి నైరుతి దిశలో ఉంచండి. ఈ ప్రాంతంలో ఖజానా ఉంచడం స్థిరత్వం, సంపదకి చిహ్నం. లాకర్ తలుపు పశ్చిమ దిశలో ఎప్పుడు ఓపెన్ చేయకూడదని గుర్తుంచుకోండి. అలా చేస్తే డబ్బు వినాశనం జరుగుతుంది. అలానే బీరువాలో చిన్న లక్ష్మీదేవి ఫోటో ని పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలానే లక్ష్మీదేవి కూర్చున్నట్లు ఉండే ఫోటోలని పెడితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తొండం ఎత్తిన ఏనుగుల బొమ్మల్ని పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. బీరువా కి లైట్ క్రీమ్ కలర్ పెయింట్ వేస్తే చాలా మంచి కలుగుతుంది.

Vastu Tips : మీ ఇంట్లో డబ్బు ఎప్పుడు నిలవాలంటే.. 

Advertisement

మీ నగదు, కార్డులను ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంచండి. ఉత్తర దిక్కు సంపదకు దేవుడు అయిన కుబేరుడు ఉంటాడని నమ్ముతారు. ఉత్తర దిశలో ఒక స్థలాన్ని ఎంచుకొని ప్రతిరోజు అక్కడ నగదు నిల్వ చేయండి. డబ్బును నాలుగు, ఐదు మూలల్లో ఉంచడం మానుకోండి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల డబ్బు ఇబ్బందులు ఎదురవుతాయి. మీ డబ్బును దక్షిణ దిశ నుంచి దూరంగా ఉంచడం మంచిది. బాత్‌రూమ్‌లు, కిచెన్‌లు, మెట్లు లేదా స్టోర్‌రూమ్‌ల దగ్గర లాకర్లు ఉంచవద్దు. ఇది డబ్బు వినాశనానికి కారణమవుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఎలాంటి చిట్కాలను అనుసరించాలి అనేది తెలుసుకున్నారు. మరి వాటిని ఫాలో అయిపోయి ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండండి.

Read Also : Extra Marital Affair : మామిడి తోటలో ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భార్య… ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel