Arvind Kejriwal : దేశీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేష్ ఫొటోలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను తీసుకురావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని కోరారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఇలా సాయపడేందుకు దోహదపడుతుందని కేజ్రీవాల్ సూచించారు. దేశీయ కరెన్సీ నోట్లపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన చెప్పారు. భారత కరెన్సీపై (మహాత్మా) గాంధీజీ ఫోటో ఉంది.
అది అలానే ఉండనివ్వండని, మరోవైపు, శ్రీ గణేష్, లక్ష్మి దేవీ ఫొటోలను చేర్చాలని కేజ్రీవాల్ అన్నారు. తాను చెప్పినట్లు దేశీయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు చాలా కృషి చేయాలన్నారు. దేవుళ్లు, దేవతల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పారు. కరెన్సీ నోట్లపై దేవుళ్ల ఫొటో ఉంటే దేశం మొత్తం ఆశీర్వాదం పొందుతుందని తెలిపారు. అమెరికా డాలర్‌తో పోల్చితే భారత రూపాయి మారకం విలువ రోజురోజుకీ క్షీణించిపోతోందని కేజ్రీవాల్ తెలిపారు.
Arvind Kejriwal : ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై గణేషుడి బొమ్మ..
ఒకవైపు గణేష్, లక్ష్మీ ఫొటోలకు మరోవైపు గాంధీజీ ఉంటారని ఆయన అన్నారు. లక్ష్మి శ్రేయస్సుకు దేవత అని, గణేష్ అడ్డంకులను తొలగిస్తాడని కేజ్రీవాల్ అన్నారు. అన్ని నోట్లను మార్చమని నేను చెప్పడం లేదని చెప్పారు. కానీ, ప్రతి నెల విడుదల చేసే అన్ని కొత్త కరెన్సీ నోట్లలో లక్ష్మీదేవి, గణేష్ ఫొటోలు ఉండాలని సూచించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ ఈ సందర్భంగా ఇండోనేషియాను ప్రస్తావించారు. ఆ దేశం ముస్లిం దేశమైనప్పటికీ అక్కడి కరెన్సీ నోటుపై గణేష్ ఫొటో ఉంటాయని గుర్తు చేశారు.
ఇండోనేషియా ఆ పని చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేమని, అందుకే లక్ష్మి, గణేష్ ఫొటోలు కొత్త కరెన్సీ నోట్లపై ముద్రించాలని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇండోనేషియాలోని 20వేల కరెన్సీ నోటుపై గణేష్ ఫొటోను ముద్రించారు. దీని విషయమై విజ్ఞప్తి చేసేందుకు ఈ రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాస్తానని కేజ్రీవాల్ చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలే కాకుండా సర్వశక్తిమంతుడి ఆశీస్సులు దేశ ప్రజలకు అవసరమని కేజ్రీవాల్ అన్నారు.
Read Also : Actress Samantha : సమంత ఇలా మారిపోయిందేంటి? ఆ పార్ట్‌కు అందుకే సర్జరీ చేయించుకుందా? షాక్‌లో ఫ్యాన్స్..!