Vastu Tips: ఇంట్లో గణపతి విగ్రహం, పటం పెట్టాలంటే ఈ వాస్తు జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే?

Vastu Tips: గణేశుడిని అగ్రదేవుడిగా భావిస్తారు. ఏ పని మొదలు పెట్టాలన్న మొదట గణేశుడికి పూజ చేయాలి. గణేషుడిని శుభానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఉన్న సకల విఘ్నాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలకాలం ఉండాలంటే ఇంట్లో గణేశుడి విగ్రహం ప్రతిష్టించాలి. అయితే గణపతి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించే ముందు వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముఖ్యంగా ఇంట్లో ఈశాన్యం మూలలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా మంచిది. ఇంట్లో ఈశాన్య మూలలో పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని లేదా పటాన్ని తూర్పు లేదా పడమర దిశలో ఉండేలాగా చూసుకోవాలి. పొరపాటున కూడా దక్షిణ దిశ వైపు వినాయకుడిని ఉంచరాదు. ఇక ఆఫీస్ లేదా షాప్ లలో గణేష్ విగ్రహాన్ని ఉంచాలనుకునేవారు గణేష్ కూర్చున్న భంగిమలో కాకుండా నిలుచున్న విగ్రహాన్ని ఉంచటం మంచిది. తెల్ల జిల్లేడు చెక్కలతో చేసిన గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ఉంచటం చాలా శుభప్రదం. ఎట్టి పరిస్థితుల్లోనూ గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ఉన్న మూలలలో కానీ , మెట్ల కింద కానీ ఉంచరాదు.

Advertisement

Vastu Tips:

గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలనుకునేవారు ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గణేశుడు తొండం ఎడమవైపు ఉన్న విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ఉంచుకోవడం మంచిది. వివిధ రకాల గణేష్ విగ్రహాలను మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. జిల్లేడు చెక్కతో చేసిన గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి. అలాగే స్పటిక గణేష్ విగ్రహాన్ని ఇంట్లో దేవుడి గదిలో ఉంచుకొని పూజ చేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే పసుపు గణపతిని ఇంట్లో ప్రతిష్టించి పూజ చేయడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోయి ఇంట్లో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. అయితే గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో వాస్తు చూసి ఏర్పాటు చేసుకోవడం మంచిది.

Advertisement