...

Vastu Tips for Tulsi : తులసి మొక్కను ఈ దిశలో కనుక నాటితే కష్టాలు మీవెంటే..!

Vastu Tips for Tulsi : సాధారణంగా ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు చేస్తాము. అందుకే తులసి మొక్కను దైవ సమానంగా భావించి ప్రతి రోజు ఉదయం సాయంత్రం పెద్దఎత్తున దీపారాధన చేసి పూజ చేస్తుంటారు. అయితే చాలా మంది తులసి మొక్కను నాటే విధానంలో వారికి అనుగుణంగా తులసి మొక్కను నాటి పూజలు చేస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను కొన్ని ప్రదేశాలలో నాటినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి తులసీ మొక్కను ఏ దిక్కున నాటాలో ఇక్కడ తెలుసుకుందాం….

if-you-plant-a-tulisi-plant-in-this-direction-its-badluck-to-you
if-you-plant-a-tulisi-plant-in-this-direction-its-badluck-to-you

సాధారణంగా మనం మన ఇంటి ఆవరణంలో ఎక్కడ మనకు అనుగుణంగా ఉందో అక్కడ తులసి మొక్క నాటుతాము ఇలా చేయడం చాలా పొరపాటని నిపుణులు చెబుతున్నారు.తులసి మొక్కను ఎల్లప్పుడు తూర్పు దిశలో ఉంచాలి. ఒకవేళ తూర్పులో మనకు స్థలం లేకపోతే ఉత్తర ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటడం ఎంతో మంచిది.

Vastu Tips for Tulsi : తులసి మొక్కను ఏ దిక్కున ఉండాలంటే..

ఇలా ఈ దిశలో తులసి మొక్క నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలిగి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడమే కాకుండా మన ఇల్లు మొత్తం అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా తూర్పు ఉత్తర ఈశాన్య దిశలలో కాకుండా దక్షిణ దిశలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో అనేక సమస్యలు కలుగుతాయి.

ఎందుకంటే దక్షిణ దిశ పూర్వీకుల దిశ.అందుకే దక్షిణ దిశలో కానీ లేదా ఇంటి పై కప్పు పై గానీ తులసి మొక్కను ఎప్పుడు నాటకూడదు.అలాగే తులసి మొక్క పక్కన ఎప్పుడు ముళ్లు కలిగిన చెట్లను నాటకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Read Also : Coconut Remidies: దృష్టి దోషం తొలగిపోవాలంటే.. కొబ్బరికాయతో ఈ పరిహారాలు పాటించాల్సిందే!