Intinti Gruhalakshmi Aug 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి కనిపించకపోవడంతో సామ్రాట్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో తులసి కనిపించకపోయేసరికి తులసి అంటూ గట్టిగా అరుస్తాడు సామ్రాట్. ఇంతలోనే తులసి అక్కడికి వచ్చి నన్ను అక్కడికి వెళ్లదు అని చెప్పి మీరు ఎందుకు వెళ్తున్నారు అని అనగా సామ్రాట్ టెన్షన్ తో తులసి పై కోప్పడతాడు. వరకు ఇక్కడే ఉన్నారు మళ్ళి ఇంతలోనే ఎక్కడికి వెళ్లావు అంటూ తులసి పైర్ అవుతాడు. అప్పుడు తులసి సముద్రంలో నీళ్లలో ఆడినందుకు వేడిగా మొక్కజొన్న తినాలనిపించింది.
Intinti Gruhalakshmi Aug 18 Today Episode : తులసి,సామ్రాట్.. కోపంతో రగిలిపోతున్న నందు..
మీ దగ్గరికి వస్తే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు అందుకే నేను వెళ్లి తీసుకు వచ్చాను అని అనటంతో అప్పుడు సామ్రాట్ కాస్త కూల్ అయ్యే తులసి తో ప్రశాంతంగా మాట్లాడుతాడు. ఇంతలోనే నందు లాస్య దంపతులు వారికి ఎదురవుతారు. మరొకవైపు ప్రేమ్ మాట్లాడిన మాటలను తలుచుకొని అంకిత బాధపడుతూ ఉంటుంది.
ఇద్దర్నీ ఎలా అయినా కలపాలి కానీ అది తన వల్ల కాదు ఇద్దరిని కలపాలి అంటే ఆంటీ ఒక్కరే.. ఆంటీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు విషయం చెప్పేస్తాను అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అంకితకు అర్జెంటుగా ఫోన్ రావడంతో అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడు అభి మామ్ కూడా ఇంట్లో లేదు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అనగా నేను వెళ్లి తీరాల్సిందే అని అంటుంది అంకిత.
ఒకవైపు నందు, లాస్యలు సామ్రాట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు లాస్య మీ విషయంలో నేను ఒక బిట్టు కాసాను. నేనే గెలిచాను అని అనగా వెంటనే సామ్రాట్ ఏం పందెం వేశారు అని అడగడంతో, మీరు నేను బీచ్ కి వెళ్తాను అనుకున్నాను, నందు ఏమో గుడికి వెళ్తారు అని అన్నాడు తీరా మీరు చూసేసరికి బీచ్ లో ఉన్నారు నేనే గెలిచాను అని అంటుంది లాస్య.
వైజాగ్ వచ్చిన ఏ కపుల్స్ అయినా బీచ్ కి రాకుండా ఉంటారా అని అనటంతో తులసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత లాస్య మల్లెపూలు తీసుకొని వచ్చి తులసికి ఒక అప్పుడు తులసి నేను తీసుకోను అని గట్టిగా అంటుంది. అప్పుడు సామ్రాట్ తీసుకోమని చెప్పడంతో తులసి, జడలో పూలు పెడుతుంది లాస్య. మరొకవైపు శృతి వాళ్ళ అత్తయ్య కౌసల్య ప్రేమ్ విషయంలో తొందర పడ్డావు అవన్నీ మర్చిపోయి ప్రేమ్ తో కలిసి ఉండమని చెప్పడంతో నేను ఉండలేను అని అంటుంది శృతి.
Read Also : Intinti Gruhalakshmi Aug 17 Today Episode : తులసి కోసం కొట్టుకున్న నందు,సామ్రాట్.. టెన్షన్ పడుతున్న తులసి..?