Dry fruits: పండుగల మయంలో ఏ ఇంట్లో చూసినా స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. డ్రై ఫ్రూట్స్ సమయంలో బహుమతి ఇచ్చుకునే ముఖ్మమైన ఆహార పదార్థం. అతిథులకు అల్పాహారంగా కూడా ఇలాంటి డ్రైఫ్రూట్స్ ని వడ్డిస్తుంటారు. డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవి అందరికీ తెలిసిందే. అయితే వీటితో గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి లింక్ చేశారు. కానీ మీరు ఎలాంటి పరిమాణాలు లేకుండా వాటిని ఎక్కువగా తినవ్చని కాదు. వీటిని అతిగా తింటే చాలా సమస్యలు వస్తాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాదాం, వాల్ నట్స్, జీడిపప్పు, హాజెల్ నట్స్, పిస్తాలు, వంటి గింజల్లో ప్రయోజనకరమైన కొవ్వు, ప్రోటీన్, కంటెంట్ అధికంగా కల్గి ఉంటాయి. కొన్ని నట్స్ తో సాధారణ కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి నట్స్ లో ఫైటేట్స్, టానిన్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి కష్టంగా మారుతంది. వీటిల్లో ఉండే కొవ్వు వల్ల కొన్ని సందర్భాల్లో డయేరియాకు దారి తీస్తుంది.
బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు నట్స్ ఒక గొప్ప స్నాక్ గా పని చేస్తుంది. ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ కారణంగా అతిగా తినకుండా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఈ రెండూ చాలా అవసరం. కానీ ఈ స్నాక్ అధికంగా తనడం వల్ల అధిక కేలరీల ప్రభావంతో బరువు పెరగడానికి దారి తీస్తుందని మీరు గుర్తించుకోవాలి. ఎండు ద్రాక్ష వంటి చక్కెర కంటెంట్, కేలరీలను కల్గి ఉంటాయి.