KTR Next CM : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు సీఎం కేసీఆర్. రాజకీయంగా ఆయనపై ఎన్ని విమర్శలు ఉన్నా.. తెలంగాణ విషయంలో మాత్రం ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు కొనసాగించారు. ఈ విషయాన్ని రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఒప్పుకుంటారు. రాష్ట్ర అవతరణ అనంతరం మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కేసీఆర్.
వచ్చి రాగానే కొన్ని సంచనల నిర్ణయాలు, ప్రజా సంక్షేమ పథకాల రూప కల్పన వంటి పనలు చేశారు. మొదట్లో కొంచెం దూకుడుగా వ్యవహరించారనే విమర్శ ఉంది. మొదటి సారి చేసిన పనులు ఆయనను రెండో సారి కూడా సీఎంను చేశాయి. ఆయనకు ప్రజల మద్దతు అంతలా ఉంది. ముఖ్యంగా ఆయన ప్రసంగానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయన ఒక్కో మాట తూటలా పేలుతుంది.
JR NTR : యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ కోసం గ్రూపులు కడుతున్న నేతలు… ఎందుకో తెలుసా!
మాట్లాడేటప్పుడు ప్రజల దృష్టిని తనవైపు మరల్చుకోవడంలో సీఎం కేసీఆర్ దిట్ట. సీఎం ప్రెస్ మీట్ ఉందటే ఛానళ్లన్నీ కట్టేసీ ఆ ప్రెస్ మీట్ వినడానికి చాలా మంది ముందుంటారు. అంతలా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు సీఎం కేసీఆర్. కానీ ఇటీవల వచ్చిన సీ ఓటర్ సర్వే ఆయనకు ప్రజల్లో మద్దతు తగ్గిందని, సీఎంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెబుతోంది.
అయితే ఆ సర్వేలో ఎంత పారదర్శకత ఉందో లేదో తెలియదు కానీ ఆ సంస్థ చెప్పిన విషయాలు చాలా సార్లు నిజం అయ్యాయి. ఎన్నికల సమయంలో ఈ సంస్థ చేసిన సర్వే కొంచెం అటూ, ఇటూగా నిజమయ్యాయి కూడా. అయితే ఆ సర్వే ఫలితంగా ఇప్పుడు తెలంగాణ సీఎం మారబోతోందని ఉహాగానాలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సీఎం పగ్గాలు చేపట్టబోతున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అది నిజమవుతుందో కాదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Ys Jagan: 2024 ఎన్నికల్లో జగన్ సరికొత్త నినాదం.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయం?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world