Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహ కర్త, ఆర్థిక వేత్త, అంతే కాదు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రాశారు. అతను చెప్పిన నీతి సూత్రాల కారణంగా ఆయనకు కౌటిల్యుడు అని పేరు వచ్చింది. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ గ్రంథంలో అనేక అంశాలను చాణక్యుడు ప్రస్తావించారు. ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ఎంతో మందికి సరైన మార్గాన్ని చూపిస్తుంది.
చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం జీవితంలో గెలుపు తీరాలను చేరాలంటే ుత్తమ లక్షణాలను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. సద్గుణవంతుల ప్రవర్తన, భాష, మాటలు అందరినీ ఆకర్షిస్తాయి. మీరు జీవితంలో విజయం సాధించాలంటే కౌటిల్యుడు చెప్పిన ఈ విషయాలు జీవితంలో అమలు చేయాలి.
చాణక్య నీతిలో మనిషి జీవితంలో విజయవంతం కావడానికి చాలా అంశాలనే ప్రస్తావించారు. ఈ విధానాలను అవలంభించడం ద్వారా మనిషి తన జీవితంలో అమోఘమైన విజయాలనను సాధించగలుగుతాడు. అలాగే జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతాడు.
ఆచార్య చాణక్యుడిగదా పేరుగాంచిన విష్ణు గుప్తుని మాటల్లో ఎన్నో జీవిత రహస్యాలు దాగున్నాయి. జీవితంలో విజయం సాధించడానికి చాణక్య ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యాశ అనేది మనిషిపై అనవసరమైన ఒత్తిడిని తీసుకువస్తుంది. మనిషిని స్వార్థపరుడిని చేస్తుంది. అనేక తప్పుడు పనులకు పురిగొల్పుతుంది. అత్యాశ కలిగిన మనిషి వివాదాల్లో చిక్కుకుని తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాడు.
ఆచార్య కౌటిల్యుడు చెప్పిన అంశాలు అపజయం, భయం అనేవి మనిషి మనసులో ఆధిపత్యం చెలాయిస్తే దిగులు పడతారు. అలాంటి పరిస్థితుల్లో విజయం సాధించడం కష్టం. అటు వంటి పరిస్థితి నుండి బయటపడాలంటే మీ మనసులో పేరుకుపోయిన భయాలను తొలగించుకోండి.
మనిషి అహంకారానికి దూరంగా ఉండాలి. ఇది మనిషిని వాస్తవికత నుండి దూరం చేయడమే కాకుండా అతని సామర్థ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. దీని కారణం వల్ల అనేక సమస్యలు, ఒత్తిడి వస్తాయి. అత్యంత నీజాయితీతో వ్యవహరించాలనుకునే వారు అప్పుడప్పుడు తమకు తామే హాని చేసుకుంటారు. అందుకే పరిస్థితులకు అనుగుణంగా మనిషి నడుచుకోవాలని కౌటిల్యుడు సూచించాడు.
Read Also : Chanakya neethi: అలాంటి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులంట.. అందులో మీరున్నారేమో చూస్కోండి!