Viral Video : ఒక తల్లి పక్షి తన పిల్లలను రక్షించడానికి పాముపై దాడి చేసిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది. పక్షి గూళ్ల నుండి గుడ్లను తినడానికి పాములు పక్షుల గూళ్లలోకి దూరుతుంటాయి. చెట్లపై ఎక్కువగా పక్షులు గూళ్లు కట్టుకుంటాయన్న సంగతి తెలిసిందే.
వీటినే అదునుగా భావిస్తూ.. ఆ పాములు పక్షి గుళ్లను ధ్వంసం చేసి.. ఆ పక్షి పిల్లలను తినేందుకు ప్రయత్నిస్తాయి. ఇలా చెట్టుపైన ఉన్న పక్షిగూళ్ల దగ్గరకు వెళ్లిన పాము.. ఆ గుడ్లను, పిల్లలను తిన్నదా.. లేదా అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం..
అక్కడ ఒక పక్షి తన గుడ్లను రక్షించుకోవడానికి పాముపై దాడి చేయడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ‘nature27_12’ అనే నెటిజన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి ఇప్పటివరకు 2,200కి పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోలో ఆ పాము చెట్టుకొమ్మ చివర వరకు వెళ్లడం చూడవచ్చు. ఆ కొమ్మకు చుట్టుకొని ఉన్న పక్షి గూడు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇక గూడులో తల పెట్టి పక్షిగుడ్లను తినేందకు సిద్ధంగా ఉంది.
దీంతో తల్లి ఈ వ్యవహారాన్ని గమనించి.. ఆ పాముపై దాడి చేయడం ప్రారంభించింది. ఇలా తన గుడ్లను కాపాడుకునేందుకు ఆ పక్షితన ముక్కుతో పాముపై దాడి చేసింది. దీంతో ఆ పాము ఆ గూడు నుంచి తలన పైకి తీసి.. అక్కడ నుంచి పారిపోవడం గమనించవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తల్లి పక్షి చేసిన ప్రయత్నం చూసిన నెటిజన్లు తల్లి ప్రేమ ముందు ఏదైనా జీరో కావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. దెబ్బకు దయ్యం పారిపోయిందంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
Viral Video : Viral Video : ఈమె నడుముకు ఎన్ని ఒంపులో.. అచ్చం బొంగరంలా బెల్లి డ్యాన్స్.. తెగ ఊపేస్తోందిగా.. వీడియో వైరల్..!