Viral Video : త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే జంట ముందుగానే ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ ప్లాన్ చేసేస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తూ తమ ముచ్చట తీర్చుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ఓ జంట తమ పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకు ఒక లొకేషన్ ఎంచుకున్నారు.
అదంతా నది పరివాహిక ప్రాంతం.. అయితే వారికి ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆంధ్రాకు చెందిన ఆ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం నదిలో ఓ పడవ ఎక్కింది. అయితే ఆ పడవపై ఒక ముసలి తాత కూడా ఉన్నాడు. ఆ పడవ నడిపేది అతడే.. తమ ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలుపెట్టారు.

అంతే.. అక్కడ ఉన్న ముసలి తాతకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫొటో షూట్ ఎలా తీయాలో తానే డైరెక్షన్ చేశాడు. ఫొటోషూట్ స్టిల్స్ బాగా రావాలంటూ వారిద్దరికి పలు సూచనలు చేశాడు.నాటు పడవ నడిపే అతడి మాటలను చెప్పినట్టుగా వింటూ ఆ జంట కూడా ఫొటోషూట్ చేసింది.
ఎలా ఫొటోలకు ఫోజులివ్వాలో అతడు వారికి చెప్పడం చూస్తుంటే నవ్వులు పూయిస్తోంది. ముసలి తాత డైరెక్షన్‌లో ఆ జంట చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
తాత ముసలోడే కానీ, డైరెక్షన్ బాగా చేస్తున్నాడుగా అంటూ కామెంట్లు చేస్తున్నాడు. తాత డైరెక్షన్ లో ఏదైనా సినిమా చేస్తే మాత్రం బ్లాక్ బస్టర్ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా ఓసారి లుక్కేయండి..
Read Also : Shocking Video : వామ్మో.. మొసలితో సయ్యాటలా? చివరికి ఏమైందో చూడండి.. షాకింగ్ వీడియో..!