Viral video : ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లిని ఘనంగా చేసుకోవాలని అనుకుంటున్నారు. అంతేనా ఎలాంటి బెరుకు, భయం లేకుండా పెళ్లికి ముందు నుంచే రొమాంటిక్ ఫొటోలు దిగుతున్నారు. సాంగ్స్ షూట్ చేయించుకుంటున్నారు. పెళ్లిలో కూడా వధూవరులిద్దరూ కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. గత కాలంలో లాగా… పెళ్లి కూతుళ్లు సిగ్గు పడుతూ మండపంలోకి వచ్చేది. కానీ ప్రస్తుతం మాత్రం డ్యాన్స్ చేస్కుంటూ హాయిగా, ఆనందంగా వస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి స్టైల్ లోనో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ వచ్చి బంధువుల మనసుల్ని దోచేసింది. మాస్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది.
అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నవ వధువు చేసిన ఈ డ్యాన్స్ చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు నాటు నాటు పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్ వేయడం చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement