Telugu NewsDevotionalSandhya Deepam : సంధ్యాదీపం ఎందుకు వెలిగిస్తారు?

Sandhya Deepam : సంధ్యాదీపం ఎందుకు వెలిగిస్తారు?

Sandhya Deepam : సాయం సంధ్యా సమయంలో దీపం వెలిగించడం కేరళ లోని హిందువుల సాంప్రదాయం. ముఖ్యంగా పెళ్ళికాని ఆడపిల్లలు దీపం వెలిగించి.. దీపం .. దీపం.. దీపం అని మూడు సార్లు ఉచ్ఛరిస్తే.. సకల శుభాలు కలుగుతాయని అక్కడ పెద్దలు చెబుతారు. ఈ దీపాన్ని నిలవిళక్కు అంటారు. అయితే ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? ఎలా వెలిగిస్తారు? వెలిగించిన దీపం ఏ దిక్కున పెట్టాలి అనే విషయం చాలా మందికి తెలియదు. అసలు ఆ దీపం విశిష్టత ఏంటో నిశితంగా చూద్దాం.

Advertisement
sandhya-deepam-twilight-lamp-lit-in-kerala
sandhya-deepam-twilight-lamp-lit-in-kerala

ఈ నిలవిళక్కును మూడు భాగాలుగా విభజించారు. ఆ దీపం కింది భాగం బ్రహ్మగానూ, మధ్యభాగం విష్ణువు గానూ, పై భాగం శివుడిగానూ భావిస్తారు. దీపంలో నూనె పోయడాన్ని విష్ణువును ధ్యానించడంగానూ, అందులో వత్తి పెడితే.. దాన్ని శివతత్వంగానూ భావిస్తారు. ఇక అది వెలిగించడం ద్వారా వచ్చే జ్యోతి లక్ష్మీ దేవిగానూ , ఆ జ్యోతి ప్రకాశించడం తెలివితేటలకు చిహ్నంగానూ భావించి దాన్ని సరస్వతీ దేవి యొక్క అధిష్టాన దేవతగానూ కొలుస్తారు.

Advertisement

ఇక ఆ దీపంలో వేడిమి పార్వతీ తత్వంగా భావిస్తారు. సాధారణంగా ఆ దీపపు వత్తిని పత్తితో చేయడం చాలా పరమ పవిత్రమైనది గా భావిస్తారు. ఇక ఆ దీపాన్ని ఎర్రటి వత్తితో వెలిగిస్తే వివాహ సమస్యలు తీరుతాయి అని, పసుపు వత్తితో వెలిగిస్తే.. మానసిక సమస్యలు తీరుతాయని చెబుతారు.

Advertisement

ఇక ఈ దీపాన్ని ఏ ఏ దిక్కున వెలిగిస్తే ఏఏ ఫలితాలుంటాయో చూద్దాం. తూర్పు దిక్కున దీపం వెలిగిస్తే .. సకల దు:ఖాలు పటాపంచలు అవుతాయట. పడమర దిక్కున దీపం వెలిగిస్తే రుణ విముక్తులవుతారట. అలాగే ఉత్తర దిక్కున దీపం వెలిగిస్తే.. సకల ఐశ్వర్యాలు కలుగుతాయట. అయితే దక్షిణ దిక్కున మాత్రం దీపం వెలిగించడకూడదని శాస్త్రం చెబుతోంది.

Advertisement

Read Also : Chanakya niti : ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు… నవ్వుల పాలవుతారు!

Advertisement
Advertisement
Tufan9 Telugu News
Tufan9 Telugu Newshttps://tufan9.com
Tufan9 Telugu News providing All Categories of Content from all over world
RELATED ARTICLES

తాజా వార్తలు