Before Death Signs : మనిషి జీవితంలో ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొంటాడు. ఎన్నో గట్టు పరిస్థితులకు ఎదురెళ్లి నిలుస్తాడు. వాటిలో కొన్ని విషయాల్లో విజయం సాధిస్తే, మరి కొన్ని విషయాల్లో అపజయం పొందుతాడు.
జీవిత ప్రయాణంలో మంచి, చెడులు రెండూ చేస్తుంటాడు. ఇవి మానవ సహజం. జీవిత చరమాంకానికి వచ్చే సరికి మానవుడికి భయాలు చుట్టుకుంటాయి. ఎవరితో తన జీవితంలో మంచి పనులకు దూరంగా ఉంటారో అలాంటి వారికి ఆ భయం మరీ ఎక్కువగా ఉంటుంది.
ఎన్నో అక్రమాలు చేసి, ఎందరినో బాధపెట్టి తాను సంపాదించిన డబ్బు తన వెంట రాదనీ, కేవలం తాను చేసిన మంచి పనులే తన వెంట వస్తాయని గుర్తిస్తాడు. ఆ మంచి పనులే మనల్ని నలుగురు గుర్తు పెట్టుకునేలా చేస్తాయని గ్రహిస్తాడు. డబ్బు సంపాదనలో పడి జీవితాన్ని సంతృప్తిగా అనుభవించలేదని గుర్తించి బాధపడతాడు.
ఎవరైతే తన జీవిస్తూ నలుగురికి మంచిని పంచుతూ, తోటి వారికి సాయం చేస్తూ సంతృప్తిగా జీవిస్తాడో అలాంటి వారు చరమాంకంలో బాధపడరు. వారికి తన జీవితంలో చేసేశామనే తృప్తి ఉంటుంది. అయితే కొన్ని పురాణాల, శాస్త్రాల ప్రకారం జీవిత చరమాంకంలో కనిపించే లక్షణాలను బట్టి ఆ మనిషి స్వర్గానికి వెళ్తాడా ? లేదా నరకానికి వెళ్తారా అనేది తెలిసిపోతుంది.
అదేంటంటే.. మానవుని శరీరంలో 9 రంద్రాలు ఉంటాయి. వాటిని నవ రంద్రాలు అంటారు. శరీరానికి పై భాగంలో కొన్ని రంద్రాలు ఉంటే కింది భాగంలో కొన్ని రంద్రాలు ఉంటాయి. ప్రాణం పోయేటప్పుడు పైభాగం నుంచి ఆత్మ బయటకు వెళ్తే స్వార్గానికి వెళ్తారని చెబుతోంది భగవద్గీత.
కళ్ల నుంచి ఆత్మ బయటకు వేళ్తే చనిపోయిన వ్యక్తి కళ్లు మూసుకోరని, చెవి నుంచి వెళ్తే చెవి కొంచెం లాగినట్టు ఉంటుందని, ముక్కు నుంచి వెళ్తే వక్రంగా మారుతుందని చెబుతోంది. అలాగే నోటి నుంచి వెళ్తే నోరు తెరుచుకునే ఉంటుందని భగవద్గీత చెబుతోంది.
Shivalinga Puja : శివలింగానికి ఇవి అస్సలు సమర్పించకూడదు.. ఎందుకంటే ?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world