Drinking Alcohol : ఇటీవల కాలంలో కొంత మంది పిల్లలు కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. పెద్దలతో పాటు పిల్లలు కూడా వ్యసనపరులుగా మారుతున్నారు. అలా చేయడం తప్పని పిల్లలకు పెద్దలు చెప్పాలని చాలా మంది సూచిస్తున్నారు. అయితే, పెద్దలు మందు అలవాటు చేసుకున్నవారు అయితే కనుక పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా మద్యాన్ని అలవాటు చేసుకునేందుకుగాను మొగ్గు చూపుతారని పలువురు అంటున్నారు.
ఈ సంగతులు పక్కనబెడితే.. ఆల్కహాల్ సేవించడం వలన కిడ్నీ, లివర్, పొట్టలో రకరకాల సమస్యలు తలెత్తొచ్చు. ముఖ్యంగా లివర్ సమస్యలు రావొచ్చు. కాబట్టి మద్యం మానేయాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. కానీ, ఒకసారి మద్యానికి బానిస అయితే ఇంకా అంతే.. ఎప్పటికీ మద్యం వ్యసనంగా తీసుకుంటేనే ఉంటారు చాలా మంది.
కాగా, మద్యం ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా ప్రమాదకరం. అలా తీసుకోవడం వలన మీ శరీరంలోపలికి వెళ్లిన మద్యం అస్సలు జీర్ణం కాదు. ఖాళీ కడుపు ఉన్నపుడు ఆల్కహాల్ తీసుకుంటే అది డైరెక్ట్‌గా బ్లడ్ లోపలికి సర్కులేట్ అయి, బాడీలోని ప్రతీ పార్ట్‌కు రీచ్ అవుతుంది.
అలా ఆల్కహాల్ ప్రభావం మెదడుపై పడి, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. కాబట్టి ఆల్కహాల్‌ను కూల్ డ్రింక్‌తో కలిపి తీసుకుంటే మంచిదట. అలా ఆల్కహాల్‌ను కూల్ డ్రింక్‌తో కలిపి తీసుకోవడం వలన త్వరగా డైజెస్ట్ అవుతుందట. మద్యం మానలేనివారు కనీసం ఇలానైనా అనగా చల్లటి పానీయంతో కలిపి మద్యాన్ని తీసుకోవడం వలన ప్రమాద తీవ్రతను కొంత మేరకైనా తగ్గించుకోవచ్చు.
ఖాళీ కడుపుతో ఉన్నపుడు ఆల్కహాల్ తీసుకుంటే పోషకాహార లోపాలు తలెత్తుతాయి. ముఖ్యంగా తీసుకున్న మద్యం అస్సలు డైజెస్ట్ కాదు. దాంతో మీ ఆకలి మందగిస్తుంది కూడా. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఏదేని ఫుడ్ తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ అలా తీసుకోవడం సాధ్యం కాదు.
Read Also : Health Tips : ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా… అవి ఏంటంటే ?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world