King Cobra: కోబ్రాతో ఆటలొద్దు షేర్ ఖాన్.. కాటేస్తే యమలోకానికి పోతావ్

King Cobra: సోషల్ మీడియా వచ్చాక.. రోజూ ఏదో ఓ వీడియో వైరల్ గా మారుతోంది. చిన్న చిన్న అంశాల నుండి పెద్ద పెద్ద వాటి వరకు చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఏది నిజమో.. ఏది గ్రాఫికో తెలుసుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా కొన్ని వీడియోలను చూస్తే అస్సలే నమ్మబుద్ధి కాదు. అసాధ్యమైన పనులను చాలా సులువుగా చేస్తారు.

ప్రమాదకర అంశాలను ఈజీగా చేస్తుంటారు. సోషల్ మీడియాలో అలాంటివి చూసినప్పుడు ఏది నిజమో.. ఏది మాయో తెలుసుకోవడం కత్తి మీద సాములా ఉంటుంది. అలాంటిదే ఈ వీడియో కూడా.. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరిని భయపెడుతుంటే.. మరికొందరిని కళ్లప్పగించి చూసేలా చేస్తోంది. అసలు ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా.. అయితే ఇది పూర్తిగా చదవండి.

ఓ యువకుడు కింగ్ కోబ్రా పట్టుకుని ఆటలు ఆడుతున్నాడు. పాములు అంటేనే భయపడి పారిపోతాం. అలాంటిది ఆ యువకుడు ఏకంగా కోబ్రాను పట్టుకుని దానిని ఆటపట్టించాడు. అటూ ఇటూ తిప్పుతూ కామెడీ చేశాడు. అయితే ఆ యువకుడు ఎన్ని ఆటలు ఆడినా.. ఆ కింగ్ కోబ్రా మాత్రం అతడిని ఏమీ అనకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. అది గ్రాఫిక్స్ అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. దానిని మచ్చిక చేసుకున్నాడని మరికొందరు అంటున్నారు.