King Cobra Video : అదేదో సాధారణ చిన్న పాము కాదు.. కింగ్ కోబ్రా.. కాలనాగు.. కాటేస్తే పైప్రాణాలు పైకే.. అంతటి విషపూరితమైన 14 అడుగుల కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి ఎలా పట్టుకున్నాడో చూడండి.. కింగ్ కోబ్రాను దూరం నుంచి చూస్తేనే ఒళ్లు వణికిపోతుంటుంది. చెమటలు పట్టేస్తాయి.. గుండె ఆగిపోయేంత పనిఅవుతుంది.
అలాంటిది ఇతగాడు ఎవరోకానీ, దాని దగ్గరే నిలబడి ఆటలు ఆడుతున్నాడు. ఆ కింగ్ కోబ్రాను చేత్తో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. విషపూరితమైన కాలనాగు కాటేస్తుందనే ఏమాత్రం భయంలేకుండా అక్కడే నిలబడి చేతులతో పట్టేసుకున్నాడు అతడు.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఘటన థాయ్ లాండ్‌లో జరిగింది.. అతడో స్నేక్ క్యాచర్.. క్రాబీ ప్రావిన్స్ ప్రాంతంలో కింగ్ కోబ్రా కనిపించిందని సమాచారం అందగానే రంగంలోకి దిగాడు ఇతడు.. దాదాపు 4.5 మీటర్ల పొడవు (14 అడుగులు) భారీ ఆకారంలో బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు. కానీ, అక్కడికి వీరుడులా వచ్చిన నౌహాడ్ (40) వాలంటీర్.. కింగ్ కోబ్రాను ఒట్టి చేతులతో చిటికెలో పట్టేసుకున్నాడు. ఆ కోబ్రాను తన చేతుల్లో బంధించాడు.
దాదాపు 20 నిమిషాల పాటు ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. చివరికి పట్టేసుకున్నాడు. అక్కడ వారు ఎవరో ఈ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఈ పాము దాదాపు 14 అడుగుల పొడవు.. బరువు 10 కిలోలు వరకు ఉంటుందని అంటున్నాడు. అతడి ధైర్యాన్ని మెచ్చి అక్కడి వారంతా శభాష్ అని ప్రశంసిస్తున్నారు. ఆ కింగ్ కోబ్రాను అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశాడు సాహసవీరుడు..
Read Also : King cobra viral video: ఆరడుగుల కింగ్ కోబ్రా నోటి నుంచి బయటకొచ్చిన మరో పాము..!