UAE: సాధారణంగా ఒక్కొక్క ఒక దేశంలో ఎన్నో విభిన్న జాతులు ఉంటాయి.ఇలా ఒక్కొక్క మతం వారు ఒక్కో ఆచారవ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. ఇలా ఎవరికి వారు వారి ఆచారాలను పాటిస్తున్నప్పటికీ, ఆ దేశానికి సంబంధించిన కొన్ని రూల్స్ తప్పనిసరిగా అందరూ పాటించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని దేశాలు ఆ దేశ ప్రజల పై విధించిన ఆంక్షలు తెలిస్తే మాత్రం భయంకరంగా అనిపించినప్పటికీ కొన్నిసార్లు వినడానికి కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అలా వినడానికి వింతగా అనిపించే వాటిలో ఇది ఒకటి. ఈ క్రమంలోనే యూఏఈ ఈ దేశంలో బాల్కనీలో పొరపాటున బట్టలు ఆరేస్తే కనుక తప్పనిసరిగా 20 వేల రూపాయల జరిమానా కట్టాల్సిందే.
ఈ నిబంధన వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అయితే ఇలా ఈ నిబంధన పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. మరి ఆ కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ప్రపంచంలో టూరిస్ట్ ప్లేస్ లో ఒకటైన ఈ దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఎంతో మంది టూరిస్టులు ఈ దేశానికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇలా బాల్కనీలో బట్టలు ఆరేయడం వల్ల ఆ నగరానికి ఉన్న అందం కోల్పోతుందని భావించి ఈ విధమైనటువంటి రూల్ ప్రకటించారు.
ఈ దేశంలో పొరపాటున కూడా ఎవరైనా బాల్కనీలో బట్టలు ఆరేయడం చేస్తే 20,000 రూపాయలు జరిమానా కట్టాల్సిందే. ఇక ఈ దేశంలో వారు కేవలం బట్టలు బయట ఆరేయకుండా లాండ్రీ, డ్రయింగ్, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ లాంటి వాటితో బట్టలు ఆరబెట్టుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఏది ఏమైనా ఆ దేశం ఎంతో అందంగా కనిపించడం కోసం ఆదేశ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.