Devotional Tips: అరిటాకులో భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసా?

Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పురాతన కాలంలో మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అరిటాకులో భోజనం పెట్టే వాళ్ళు. అలాగే ఏదైనా పూజా కార్యక్రమాలు, శుభ కార్యాలలో కూడా అతిథులకు బంధువులకు అరిటాకు భోజనం పెట్టి పంపించేవారు. కాలం మారుతున్న కొద్దీ అరిటాకులు కూడా మరుగున పడిపోయాయి. అయితే కొన్నిచోట్ల ఇప్పటికీ ఇదే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే.ఇక మనకు ఎవరైనా విష ప్రయోగం చేస్తున్నారనే విషయాన్ని అరిటాకు ఎంతో సులభంగా గుర్తిస్తుంది.

మన పై ఎవరైనా విష ప్రయోగం చేస్తే అరిటాకులో భోజనం పెట్టడం వల్ల ఆ భోజనం మొత్తం నీలి రంగులోకి మారుతుంది. అందుకే పూర్వకాలంలో ఎక్కువగా అతిథులు అరటి ఆకులోనే భోజనం చేసేవారు. అయితే అరిటాకులో భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ నియమాలు ఏమిటి అనే విషయానికి వస్తే… అరిటాకులో భోజనం చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా అరటాకు ఈనే తుంచకూడదు. ఇలా ఈనె ఎప్పుడూ కూడా ఎడమ వైపు ఉండేలా పెట్టుకోవాలి.

అరిటాకులో ముందుగా కుడివైపు పాయసం వడ్డించాలి. కుడి వైపు నుంచి వరుసగా పప్పు, పచ్చడి, రసం, చివరిగా పెరుగు వడ్డించాలి. ఇక అరటాకు మధ్యలో అన్నం వడ్డించుకుని తినాలి. ఈ విధంగా అరిటాకులో భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇకపోతే అరిటాకులో భోజనాన్ని అమావాస్య, పౌర్ణమి వంటి రోజులలో చేయకూడదని పండితులు చెబుతున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel