Sudigali Sudheer : సుడిగాలి సుదీర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎక్కడో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం ఈటీవీ మల్లెమాల వారని చెప్పడంలో ఏమాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి ఈయనకు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అవకాశం కల్పించారు. ఇలా జబర్దస్త్ లో కమెడియన్ గా ఉన్నటువంటి సుధీర్ తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగారు.ఇలా టీం లీడర్ గా ఉండటమే కాకుండా మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు, అలాగే ఢీ కార్యక్రమంలో కూడా సుధీర్ సందడి చేశారు.
Sudigali Sudheer
సుధీర్ టాలెంటుతో ఆయన అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఆ గుర్తింపుతో వెండితెర అవకాశాలను అందుకొని పలు సినిమాలలో నటించడమే కాకుండా ప్రస్తుతం హీరోగా కూడా అవకాశాలను అందుకున్నారు. ఈ విధంగా తన కెరియర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతున్న సమయంలో సుడిగాలి సుదీర్ తనకు లైఫ్ ఇచ్చిన ఈటీవీకి దూరం అవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదట ఈయన ఢీ నుంచి బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే సుదీర్ ఈ కార్యక్రమాన్ని వదిలి రావడానికి కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చినప్పటికీ అసలు విషయం మాత్రం తెలియడం లేదు. ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి కూడా సుదీర్ దూరం అయినట్లు తెలుస్తోంది.ఈ విధంగా ఈ టీవీకి దూరమైన సుదీర్ స్టార్ మా లో సందడి చేస్తున్నారు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న జూనియర్ సూపర్ సింగర్ కార్యక్రమానికి అనసూయతో కలిసి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ విధంగా సుదీర్ పూర్తి స్థాయి యాంకర్ గా స్టార్ మాకు రావడంతో ఈయన పూర్తిగా ఈటీవీకి దూరం అవుతారా లేదంటే ఈటీవీతో పాటు స్టార్ మాలో కూడా యాంకర్ గా కొనసాగుతారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Read Also : Sudigali sudheer : సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి డ్యాన్స్ వీడియో వైరల్.. షాక్ లో రష్మి!