Sudigali sudheer : తెలుగు బుల్లి తెరపై ఎవర్ గ్రీన్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జబర్దస్త్ పాపులర్ అయిన సుధీర్.. ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. యాంకర్ గా, నటుడిగా, కమెడియన్ గా, మెజీషియన్ గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కనిపిస్తున్నారు. బుల్లి తెరపై ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు సుధీర్ పుట్టిన రోజు. ఆత్మీయులతో పాటు అభిమానులు సైతం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుధీర్ నటిస్తున్న కొత్త చిత్రం వాంటెడ్ పండుగాడు సినిమా సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది.
సుధీర్ బర్త్ డే సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ.. ఓ వీడియోను విడుదల చేసింది. సినిమాలోని సుధీర్ క్యారెక్టర్ కు సంబంధించిన వీడియో ఇది. ఇందులో సుధీర్ యాంకర్ దీపిక పిల్లితో కలిసి ఉన్న ఓ పాటకు సంబంధించిన షాట్ తో పాటు దర్శకేంద్రుడు కే రాధవేందర్ రావుతో కలిసి ఉన్న మరో షాట్ ను షేర్ చేశారు. మదటి షాట్ లో సుడిగాలి సుధీర్, యాంకర్ దీపిక పిల్లి కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేయడం కనిపించింది. అయితే ఇది చూసిన రష్మి… సుధీర్ ను ఏమంటుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ గా మారింది.
Read Also :Anchor Anasuya: అనసూయకి పువ్వు ఇవ్వబోయి.. పుష్పం అయిన కమెడియన్.. పగలబడి నవ్విన జడ్జెస్?